మణిపూర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది.అక్కడ పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా రెండో రోజు పర్యటిస్తున్నారు.
సాధారణ పరిస్థితులను తీసుకువచ్చేందుకు గానూ శాంతి భద్రతలపై ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా మణిపూర్ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు కమ్యూనిటీ లీడర్లతో చర్చిస్తున్నారు.
కాగా అమిత్ షా పర్యటన జూన్ 1వ తేదీ వరకు కొనసాగనుంది.మరోవైపు మణిపూర్ లో రాష్ట్రపతి పాలన రావాలనే అంశం తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలో మణిపూర్ పరిస్థితులను కాంగ్రెస్ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనుంది.ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది.