గిట్టుబాటు ధర లేక బెండ పంటను నీటిపాలు చేసిన రైతు.. కన్నీళ్లు పెట్టుకుంటూ?

దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోంది.ప్రభుత్వ, ప్రైవేట్, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసేవాళ్లకు ప్రతి సంవత్సరం వేతనాలు కొంతమేర అయినా పెరుగుతున్నాయి.

 Okra Price Drops On Low Demand Farmers Get Only 2 Rupees Kg For Okra Details, Fa-TeluguStop.com

అయితే దేశంలోని రైతుల పరిస్థితి( Farmers ) మాత్రం మారడం లేదు.గిట్టుబాటు ధర లేక రైతులు పంటను నేల పాలు చేస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

కన్నీళ్లు పెట్టుకుంటూ రైతులు తమ పంటను చేతులారా నాశనం చేస్తున్నారు.

తాజాగా తమిళనాడు రాష్ట్రంలో( Tamil Nadu ) జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ ఘటన ఎంతోమందికి కన్నీళ్లు తెప్పిస్తోంది.

తమిళనాడు రాష్ట్రంలో కిలో బెండకాయ 2 రూపాయలు పలుకుతుండటంతో పంటను నీటి పాలు చేశానని సదరు రైతు చెబుతున్నారు.కిలో 2 రూపాయలు( Rs.2/Kg ) ధర ఉండటం వల్ల పెట్టుబడి ఖర్చులు రూపాయి కూడా రావని పంట( Okra Farmer ) అమ్మితే వచ్చే డబ్బులు రవాణాకు కూడా సరిపోవని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Afdable, Farmers, Okra, Okra Crop, Tamil Nadu, Tamilanadu, Tomatoes-Gener

5 టన్నుల బెండకాయలు నీటిపాలు అయ్యాయంటే ఆ రైతు ఎంత బాధ పడి ఉంటాడో చెప్పాల్సిన అవసరం లేదు.రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రయోజనం చేకూరేలా గిట్టుబాటు ధర( Affordable Price ) కల్పించేలా చేయడంలో ఫెయిలవుతున్నాయి.రైతుల నుంచి కిలో బెండకాయ 2 రూపాయలకు కొంటున్న వ్యాపారులు మార్కెట్ లో కిలో 40 రూపాయలకు విక్రయిస్తున్నారు.

Telugu Afdable, Farmers, Okra, Okra Crop, Tamil Nadu, Tamilanadu, Tomatoes-Gener

దేశంలో రైతులు మాత్రమే మోసపోతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రెండు నెలల క్రితం కిలో టమోటా 200 రూపాయలు( Tomatoes ) పలకగా ఇప్పుడు రైతుల నుంచి 5 నుంచి 10 రూపాయల మధ్యలో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.ధరలు తగ్గడంతో ఇబ్బందులు పడుతున్నామని టమోటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటన విషయంలో తమిళనాడు సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.రైతులు నష్టపోకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube