వరదల్లో చిన్నారులను కాపాడిన వ్యక్తి.. సూపర్‌హీరో అంటున్న నెటిజన్లు!

వర్షకాలం మొదలవ్వడంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తున్నాయి.ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడి ఇప్పటికే కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకోగా కోట్లరూపాయల ఆస్తి నష్టం జరిగింది.

 Netizens Are Calling The Person Who Saved The Children In The Flood A Superhero-TeluguStop.com

అలాగే మరికొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తమ ఇళ్ళనుండి బయటకి రాలేక, అలాగని ఇళ్లల్లో ఉండలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో ఈ వరదలకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా సోషల్ మీడియాలో తారసపడిన ఓ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.అందులో తన ప్రాణాలకు తెగించి మరీ ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలను కాపాడాడు.ఇక ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూసినట్లయితే, నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ఇద్దరు చిన్నపిల్లలు ఆ వరదల్లో చిక్కుకున్నారు.అదే సమయంలో అక్కడకు ఫోటోస్ తీసేందుకు వచ్చిన ఓ ఫోటోగ్రాఫర్ ఆ చిన్నారులిద్దరిని గమనించాడు.

అంతే తన ప్రాణాలను ఏమాత్రం లెక్కచేయకుండా వరదల్లో చిక్కుకున్న పిల్లలిద్దరిని ఎంతో ధైర్యంతో ఒడ్డుకు తీసుకువచ్చాడు.

అతను పిల్లలను ఒడ్డుకు చేర్చేందుకు ఎంతగా కష్టపడ్డాడో వీడియోలో సుస్పష్టంగా కనబడుతోంది.అతని బ్యాలెన్స్ కాస్త తప్పినా పిల్లలతోపాటు అతను నీటి ప్రవాహం కొట్టుకుపోయేవాడు.అయినా ఎక్కడ పట్టు విడువకుండా వారిని కాపాడిన తీరు వర్ణనాతీతం.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఈ ఘటన ఒమన్ లోని బహ్లా పట్టణంలో జరిగినట్లుగా స్పష్టమౌతోంది.

ఫోటో గ్రాఫర్ పేర అలి బిన్ నస్సెర్ అల్ వర్డీ అని చెబుతున్నారు.ఈ వీడియోకు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

అతగాడిని ‘రియల్ హీరో’ అని కొనియాడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube