జై జగన్ అన్నా అంటూ వెటకారంగా పోస్ట్ పెట్టిన నటుడు బ్రహ్మాజీ.. అసలేమైందంటే?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ నటుడు కమెడియన్ బ్రహ్మాజీ( Brahmaji ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటుడిగా కమెడియన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు బ్రహ్మాజీ.

 My Social Media Account Hacked Says Brahmaji, Brahmaji, Tollywood, Tweet Viral,-TeluguStop.com

మంచి మంచి పాత్రలతో పాటు అప్పుడప్పుడు విలన్ క్యారెక్టర్లలో కూడా నటించిన విషయం తెలిసిందే.ముఖ్యంగా కామెడీ తరహ పాత్రలలో ఎక్కువగా నటించి తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తూ ఉంటారు.

ప్రస్తుతం బ్రహ్మాజీ కేవలం అడపాదడపా సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా బ్రహ్మాజీ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియా( Social media )లో వైరల్ కావడంతో తాజాగా ఆ విషయం పై స్పందించారు.

అసలేం జరిగిందంటే.విజయవాడలో ప్రజలు వరదలతో అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ వరదలు వచ్చి ఎనిమిది రోజులు గడుస్తున్నా బాధితులకు సాయం అందడం లేదని ఆరోపిస్తూ, అసలు ఇదంతా ఎందుకు జరిగిందో చెబుతూ ట్విట్టర్ వేదికగా జగన్‌ సుదీర్ఘ పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.

క్షేత్రస్థాయిలో జరుగుతున్న సాయం మీకు కనపడటం లేదా అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు.ఐదేళ్ల పాటు మీరు చేసిన నిర్వాకం వల్లే ఈ పరిస్థితి దాపురించింది.

రాజకీయంగా ఆడే ఆట కాదు.ఇది ప్రజల జీవితంసోషల్‌మీడియాలో ఈ విమర్శలు ఆపేసి.

ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం చేయండి అంటూ నెటిజన్లు మండిపడ్డారు.

చాలావరకు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ జగన్ ( YS jagan )పైనే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఇది ఇలా ఉంటే జగన్‌ పోస్ట్‌పై సినీ నటుడు బ్రహ్మాజీ స్పందించారు.వివిధ అంశాలపై సామాజిక మాధ్యమాల వేదికగా తనదైన శైలిలో స్పందించే బ్రహ్మాజీ.

జగన్‌ పోస్ట్‌కూ అలాగే సమాధానం ఇచ్చారు.మీరు కరెక్ట్ సార్.

వాళ్ళు చెయ్యలేరు.ఇకనుంచి మనం చేద్దాం.ఫస్ట్‌ మనం రూ.1000 కోట్లు విడుదల చేద్దాం.మన వైకాపా కేడర్‌ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం .మనకి జనాలు ముఖ్యం.ప్రభుత్వం కాదు.మనం చేసి చూపిద్దాం సార్.

జై జగన్‌ అన్నా అంటూ పోస్ట్‌ పెట్టారు.అయితే ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు బ్రహ్మాజీ పై మండిపడ్డారు.

దాంతో ఆ పోస్ట్ పై స్పందించిన బ్రహ్మాజీ.నా అకౌంట్ హ్యాక్ కీ గురైంది.

నా ట్విట్టర్ ఖాతాని ఎవరో హ్యాక్ చేశారు.నాకు ఆ ట్వీట్ కు ఎలాంటి సంబంధం లేదు.

ఆ ట్వీట్ పై ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశాం అని తెలిపారు బ్రహ్మాజీ.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube