ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ముస్లిం దాత విరాళం

నల్గొండ జిల్లా:నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మహమ్మద్ రవూఫ్ నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి రూ.60 వేల విరాళం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషుల మధ్య కులమత బేధాలు వద్దని, మనమంతా ఒకటేనని,దైవ కార్యం ఏదైనా అందరం ఒకటిగా సహకరించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కోట రఘునందన్, వీరమల్ల లవయ,సంఘపు గణేష్ తరదితులు పాల్గొన్నారు.

Muslim Donor Donates For The Construction Of Anjaneya Swamy Temple, Muslim Donor
నకిరేకల్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పై కేసు నమోదు

Latest Nalgonda News