ముద్రగడ ఓపెన్ అయిపోయారా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ని ఉద్దేశించి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) రాసిన లేక ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది .ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ చిత్తశుద్ధిని ప్రశ్నించిన ఆయన పవన్ వ్యవహార శైలిని కూడా విమర్శించారు.

 Mudragada Openly Committied His Political Prority , Mudragada Padmanabham , Ap P-TeluguStop.com

ఒక రాజకీయ అధినేతగా పవన్ ఉపయోగించే పదాలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన ముద్రగడ పవన్ విమర్శలు చేసిన ద్వారంపూడిని వెనకేసుకొచ్చారు.ద్వారంపూడి కుటుంబ తరాలుగా తనకు తెలుసు, అని పది మందికి పెట్టే చెయ్యే కానీ దోచుకునే కుటుంబం కాదంటూ వారిని వెనకేసుకొచ్చిన ముద్రగడ వారు అనేక సందర్భాల్లో తనకు సహాయం చేసిన విధానాన్ని చెప్పుకొచ్చారు.అయితే పవన్ ను విమర్శించే విధానంలో తాను వైసిపికి మద్దతు అని చెప్పకనే చెప్పుకున్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉందని వార్తలు వస్తున్నాయి.
class=”middlecontentimg”>

కాపులనుబిసి లలో చేరుస్తానని మాట ఇచ్చి తప్పిన చంద్రబాబు( Chandrababu Naidu ) పై వ్యతిరేకంగా భారీ ఎత్తున ఉద్యమం చేసి తుని సంఘటనకు కారణమైన ముద్రగడ జగన్ అదికారంలోకి వచ్చినప్పటి నుంచి కాపు ఉద్యమంపై నోరు ఎత్తకపోవడం ఎందుకొ ఆయన మనస్సాక్షికి తెలియాలంటూ జనసేన అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు.కాపు కార్పొరేషన్ కు కనీసం కూడా నిధులు కేటాయించకపోవడం పై కూడా ప్రభుత్వాన్ని నిలదీయలేని ముద్రగడ చిత్తశుద్ది ని ఇప్పుడు ప్రశ్నార్థకం చేస్తున్నారు.రాజకీయ నాయకుడు పాటించాల్సిన మర్యాదల గురించి క్లాస్ పీకుతున్న ముద్రగడ పవన్ పై వైసీపీ నాయకులు మాట్లాడుతున్న విధానాన్ని మాత్రం ఎందుకు ఖండించరు అంటూ జనసేన నేతలు ఎదురు దాడి చేస్తున్నారు .
class=”middlecontentimg”>

మొదటి నుంచి వైసీపీ( YCP )పార్టీకి అనుకూలంగానూ తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకంగా మాట్లాడే ముద్రగడ ఇప్పుడు తమ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వకపోవడాన్ని మెజారిటీ కాపు యువత వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది.తన రాజకీయ ప్రయోజనాలకోసమే ఆయన ఇలా మాట్లాడుతున్నారని , ముద్రగడ జగన్ కి అమ్ముడుపోయారంటూ కాపు సేన నాయకుడు హర రామ జోగయ్య వంటి వారు విమర్శించడం గమనార్హం .ఏది ఏమైనా ఉభయ గోదావరి జిల్లాలలో మెజారిటీ సీట్లను గెలుచుకోవాలని ఆశిస్తున్న జనసేనకు ముద్రగడ ద్వారా చెక్ పెట్టాలన్న అధికార పార్టీ ప్రయత్నం కొంతవరకు సఫలీకృతమైనట్టుగా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube