రోడ్డుపై పశువుల సంచారం ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని ఇందిరా సెంటర్ నుండి పోలీస్ స్టేషన్, కూరగాయల మార్కెట్ వరకు సమీప ప్రాంతాల్లో మెయిన్ రోడ్డుపై ఉదయం, రాత్రి సమయాల్లో అడ్డంగా పశువులు సంచరిస్తూ,అడ్డంగా పడుకోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు.

రద్దీ ప్రాంతాల్లో వాహనాల మధ్య నుంచి వెళ్లడంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవతూ భయభ్రాంతులకు గురవుతున్నారు.

సంబంధిత అధికారులు స్పందించి పశువులను రోడ్డుపై సంచరించకుండా నివారణ చర్యలు చేపట్టాలని వాహన చోదకులు కోరుతున్నారు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности

Latest Suryapet News