రియల్ హీరో అంటే నువ్వే భయ్యా.. మురికి కాలువలో దూకి ఆవు ప్రాణాలు కాపాడాడు..

ప్రపంచం ఎంత వేగంగా పరిగెడుతున్నా, మానవత్వం( Humanity ) ఇంకా బతికే ఉందని గుర్తు చేసే సంఘటనలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తూనే ఉంటాయి.తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్( Viral Video ) అయింది.

 Man Goes Above And Beyond To Rescue Helpless Cow Stuck In Drainage Video Viral D-TeluguStop.com

ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి మురికి కాలువలో పడిన ఆవును( Cow ) కాపాడిన వీడియో చూస్తే ఎవరికైనా కళ్లు చెమర్చడం ఖాయం.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ ఆవు మురికితో నిండిన కాలువలో( Drainage ) పడి కొట్టుమిట్టాడుతూ కనిపించింది.

తనంతట తాను బయటకు రాలేక విలవిల్లాడుతోంది పాపం.సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆవు దీనస్థితిని చూసి వెంటనే కాలువలోకి దూకేశాడు.

రెండో ఆలోచన లేకుండా బురద, వ్యర్థాలతో నిండి ఉన్న కాలువలోకి దిగిపోయాడు ఆ వ్యక్తి.ఆవును ఒంటరిగా పైకి లాగేందుకు విశ్వప్రయత్నం చేశాడు.

కానీ ఆవు బరువు ఎక్కువ ఉండటంతో అతని ప్రయత్నాలు ఫలించలేదు.అయినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

చుట్టుపక్కల వాళ్లు గుంపుగా చేరి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు.కాసేపటికి కొందరు ముందుకు వచ్చి సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు.వెంటనే తాడు తెచ్చి ఆవుకు కట్టారు.కాలువలో ఉన్న వ్యక్తి ఆవును పైకి తోస్తూ ఉండగా, మిగిలిన వాళ్లు తాడుతో పైకి లాగడం మొదలుపెట్టారు.చాలా కష్టపడి, అందరూ కలిసికట్టుగా ప్రయత్నించడంతో చివరకు ఆవు సురక్షితంగా బయటపడింది.కాలువ నుంచి బయటకు రాగానే ఆవు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోయింది.

దెబ్బలు కూడా ఏమీ తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.ఏకంగా 2 కోట్ల వ్యూస్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.నెటిజన్లు ఆ వ్యక్తి చేసిన పనికి ఫిదా అయిపోయారు.కామెంట్లతో అతడిని ముంచెత్తుతున్నారు.

“నిజమైన హీరో అంటే ఈయనే” అంటూ ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు “ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు.ఎంత దయగల వ్యక్తి.” అని ఎమోషనల్ అయ్యారు.ఇంకొక నెటిజన్ అయితే “మానవత్వానికి నిజమైన నిర్వచనం” అంటూ ప్రశంసించారు.ఇలా ఎంతోమంది ఆ వ్యక్తిని ఆకాశానికెత్తేశారు.

“ఇలాంటి వీడియోలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండాలి.నిజమైన స్ఫూర్తి, నిజమైన దయ.ఇలాంటి వాళ్లే నిజమైన ఇన్‌ఫ్లుయెన్సర్” అంటూ ఒక యూజర్ కామెంట్ చేయడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube