కోతులతో ఇప్పుడు మనుషులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
ఒకప్పుడు అడవులకు పరిమితం అయిన ఈ కోతులు ఇప్పుడు ఇండ్ల మీద, ఊర్ల మీద పడ్డాయి.
ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా ఏమీ లేకుండా చాలా వరకు ఇబ్బందుల్లో పెట్టేస్తున్నాయి.పట్టణాల్లో కూడా వీటి బెడద బాగానే ఉంది.
వీటి బెడద నుంచి తప్పించుకునేందుకు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉపాయాలు ఆలోచిస్తున్నారు చాలామంది అయితే ఇప్పుడు కూడా లక్నో సిటీలోని ఓ మెట్రో స్టేషన్ లో ఇలాగే కోతుల ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది.వచ్చిపోయే ప్రయాణికులను కోతులు నానా ఇబ్బందులు పెట్టేస్తున్నాయి.
దీంతో వాటి బెడదకు ప్రయాణికులు కూడా ఆ మెట్రోలో ఆగాలంటేనే భయం భయంతో వెళ్లాల్సి వస్తోంది.కొన్ని సార్లు అయితే ప్రయాణికులపై దాడులకు కూడా తెగబడుతున్నాయి.
దీంతో వాటి భయానికి ఆ మెట్రోలో ప్రయాణాలు తగ్గిపోసాగాయి.ఇంకేముంది ఆ మెట్రో స్టేషన్‌కు ఆదాయమే తగ్గిపోసాగింది.
దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది వాటి బెడద నుంచి ఉపశమనం లభించేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు.కోతులు కొండెంగలకు భయపడతాయని వారు తెలుసుకున్నారు.
ఇంకేముంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఓ కొండెంగను తీసుకొచ్చేందుకు వారు రెడీ అయిపోయారు.కానీ అవి పెట్టడం ప్రమాదం అని కొండెంగను అరుస్తున్నట్లు ఉన్న ఆడియోను కోతులు వచ్చినప్పుడల్లా ప్లే చేయడం మొదలెట్టారు అధికారులు.కానీ కోతులు ఆ వాయిస్‌కు భయపడలేదు.
ఈ సారి మరో ప్లాన్ వేశారు.కొండముచ్చుల కటౌట్ ఫొటోలను స్టేషన్‌లో చాలా వరకు పెట్టేశారు.
దీంతో వాటిని చూసి భయపడి అటుగా వచ్చేందుకు కూడా వణికిపోతున్నాయి.దీంతో చేసేదిలేక ఆ మెట్రో వైపు రావడం మానేశాయి.
అధికారుల ఐడియాపై ఇప్పుడు నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy