గత కొంతకాలంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి( Daggubati Purandeswari ) వ్యవహార శైలి పై అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి .ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నా.
టిడిపికి మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని బిజెపిలోని కొంతమంది కీలక నేతలే అనేక సందర్భాల్లో బహిరంగంగా విమర్శలు చేశారు.దీనికి తగ్గట్లుగానే గత కొంతకాలంగా పురందరేశ్వరి వ్యవహార శైలి ఉండడం వంటివి దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
తాజా బిజెపి అభ్యర్థుల ఎంపిక విషయంలో పురందరేశ్వరి తీసుకున్న నిర్ణయంపై బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయవర్గాల తెలుస్తోంది.ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి లు పొత్తు పెట్టుకున్నాయి.175 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి 144 స్థానాలు, జనసేన 21 , బిజెపి 10 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి.ఇక పార్లమెంట్ సీట్ల విషయానికి వస్తే టిడిపి 17 , జనసేన రెండు, బిజెపి ఆరు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి.
ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించి రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను టిడిపి ప్రకటించింది.జనసేన( Janasena ) కూడా అసెంబ్లీ అభ్యర్థుల మొదటి విడత జాబితాను విడుదల చేసింది.ఒక పార్లమెంట్ స్థానంలో తమ అభ్యర్థిని ప్రకటించింది.కానీ ఇప్పటివరకు బిజెపి మాత్రం అభ్యర్థుల జాబితా ప్రకటించలేదు.10 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను పరిశీలించి ఫైనల్ చేశారు.ఈ జాబితాను బిజెపి అధిష్టానం పెద్దలకు పురందరేశ్వరి అందజేశారు.
అయితే దీనిని ఫైనల్ చేసేందుకు మూడు రోజులుగా ఆమె ఢిల్లీలోని ఉన్నారు.బిజెపి పెద్దలు అంగీకారం తెలిపితే అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు ఆమె సిద్ధంగానే ఉన్నారు .అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో బిజెపి పెద్దలు పురందేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
దీనికి కారణం ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో ఎక్కువమంది గతంలో టిడిపి( TDP )లో యాక్టివ్ గా పనిచేసి బిజెపిలో చేరిన వారే కావడంతో, ఈ విషయంలోనే అభ్యంతరం వ్యక్తం చేశారట.దీనికి తగ్గట్లుగానే కరుడుగట్టిన బిజెపి నాయకులుగా ఉన్న కొంతమంది కీలక నాయకులు మొదటి నుంచి టిడిపితో పొత్తు వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు.ఇక తాజాగా పురందరేశ్వరి ఎంపిక చేసిన జాబితాలో ఎక్కువమంది టీడీపీ నుంచి బిజెపిలో చేరిన వారే ఉండడంతో దీనిపై అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేయడంతో పురందరేశ్వరి గట్టిగానే క్లాస్ పీకారట.