బత్తాయి తోటలు( Orange gardens ) మామూలుగా అయితే సుమారుగా 30 ఏళ్ల పాటు దిగుబడులు అందించాలి.కానీ చీడపీడల, తెగుళ్ల బెడద కారణంగా దిగుబడులు 10 నుంచి 15 ఏళ్ల వరకు మించి రావడం లేదు.
తెగుళ్ల కారణంగా కొన్ని చెట్లు నాణ్యమైన కాయలు ఇవ్వడం లేదు.ఇంకొన్ని చెట్లు తక్కువ దిగుబడిని ఇస్తున్నాయి.
వీటికి ప్రధాన కారణం ఎలాంటి సంరక్షక చర్యలు చేపట్టాలో సరైన అవగాహన లేకపోవడమే.భారతదేశంలో పండ్ల తోటల సాగు విస్తీర్ణంలో మామిడి, అరటి తర్వాత బత్తాయి తోటలే అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్నాయి.
వాతావరణ పరిస్థితుల కారణంగా బత్తాయి తోటల్లో పురుగుల, తెగుల ( Insects , pests )ఉధృతి పెరిగింది.కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఉంటూ ఏవైనా చీడపీడలు లేదంటే తెగుళ్లు ఆశిస్తే సకాలంలో గుర్తించి తొలి దశలోనే అరికట్టాలి.ఒకవేళ ఆలస్యం జరిగితే ఊహించని నష్టం ఎదుర్కోవాల్సిందే.బత్తాయి పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే గజ్జి తెగుళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.ఈ గజ్జి తెగుళ్లను రసాయన పిచికారి మందులు ఉపయోగించి పూర్తిగా అరికట్టాలి.ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ ( Copper oxychloride )ను కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
లేదంటే ఒక లీటరు నీటిలో ఒక గ్రాము స్ట్రేప్టోసైక్లిన్( Streptocycline ) ను కలిపి పిచికారి చేయాలి.
బత్తాయి పంటకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడల విషయానికి వస్తే.నల్లి పురుగులు కీలక పాత్ర పోషిస్తాయి.ఈ పురుగులను అరికట్టాలంటే ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల కరిగే గంధకం కలిపి పిచికారి చేయాలి.
బత్తాయి తోటలకు చీడపీడల తెగుళ్ల వ్యాప్తి తక్కువగా ఉండాలంటే ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తొలగించాలి.మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలే విధంగా కాస్త దూరంగా నాటుకోవాలి.
అధిక ప్రాధాన్యం సేంద్రీయ ఎరువులకే ఇవ్వాలి.తెగుళ్లు లేదా చీడపీడలు ఆశిస్తే తొలి దశలోనే అరికట్టే ప్రయత్నం చేయాలి.