Chiranjeevi : అలాంటి గెటప్ లో కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేరంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

 Megastar Chiranjeevi Experiment Upcoming Movie-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమా( Vishwambara )/em>లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ కూడా మొదలయ్యాయి.

చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్‌ వశిష్ఠ.బింబిసార చిత్రంతో సూపర్‌ హిట్‌ కొట్టిన ఆయన ఈ చిత్రంతో మరో భారీ హిట్‌ కొట్టేందుకు మంచి కథను సిద్ధం చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.

Telugu Chiranjeevi, Vashishta, Tollywood, Trisha, Viswambhara-Movie

కొద్దిరోజుల క్రితమే ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లోకి మెగా​స్టార్‌ చిరంజీవితో పాటు త్రిష( Trisha ) కూడా అడుగుపెట్టింది.అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో చిరు పోస్ట్ చేశారు.ఇప్పటివరకూ చిరంజీవి నటించిన సినిమాలతో పోలిస్తే ఈ విశ్వంభరలో ఆయన సరికొత్త పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలు( Flashback Scenes ) ప్రధానంగా అందరినీ ఆకర్షిస్తాయిని తెలుస్తోంది.

అందులో మెగాస్టార్‌ సుమారు 70 ఏళ్ల వయసుకు మించిన లుక్‌లో కనిపిస్తారనే వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.వృద్ధుడి పాత్రలో కనిపించి మరో ప్రయోగానికి మెగాస్టార్‌ తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.

విశ్వంభరలో ఆ పాత్ర కీలకంగా మారనుందట.

Telugu Chiranjeevi, Vashishta, Tollywood, Trisha, Viswambhara-Movie

అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని డైరెక్టర్‌ తెరకెక్కిస్తున్నారు.దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో విశ్వంభర తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ మూవీ( Socio Fantacsy Movie ) కావడంతో వీఎఫ్‌ఎక్స్‌పై డైరెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం.విశ్వంభర సినిమా చిరంజీవి కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయేలా వశిష్ఠ( Vashista ) ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.మరి 70 ఏళ్ల పాత్రలో మెగాస్టార్ చిరంజీవిని చూసి అభిమానులు తట్టుకోగలరా, ఆ పాత్రను అభిమానులు యాక్సెప్ట్ చేయగలరా అంటూ కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మెగాస్టార్ ను ఆ ఏజ్ పాత్రలో చూసి తట్టుకోవడం నిజంగా అభిమానుల వల్ల కాదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube