Chiranjeevi : అలాంటి గెటప్ లో కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేరంటూ?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
మెగాస్టార్ ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమా( Vishwambara )/emలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ కూడా మొదలయ్యాయి.చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ వశిష్ఠ.
బింబిసార చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన ఆయన ఈ చిత్రంతో మరో భారీ హిట్ కొట్టేందుకు మంచి కథను సిద్ధం చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.
"""/"/
కొద్దిరోజుల క్రితమే ఈ బిగ్ ప్రాజెక్ట్‌లోకి మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష( Trisha ) కూడా అడుగుపెట్టింది.
అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో చిరు పోస్ట్ చేశారు.ఇప్పటివరకూ చిరంజీవి నటించిన సినిమాలతో పోలిస్తే ఈ విశ్వంభరలో ఆయన సరికొత్త పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు( Flashback Scenes ) ప్రధానంగా అందరినీ ఆకర్షిస్తాయిని తెలుస్తోంది.
అందులో మెగాస్టార్ సుమారు 70 ఏళ్ల వయసుకు మించిన లుక్‌లో కనిపిస్తారనే వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వృద్ధుడి పాత్రలో కనిపించి మరో ప్రయోగానికి మెగాస్టార్ తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.విశ్వంభరలో ఆ పాత్ర కీలకంగా మారనుందట.
"""/"/
అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారు.దాదాపు రూ.
200 కోట్ల భారీ బడ్జెట్‌తో విశ్వంభర తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.సోషియో ఫాంటసీ మూవీ( Socio Fantacsy Movie ) కావడంతో వీఎఫ్‌ఎక్స్‌పై డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం.
విశ్వంభర సినిమా చిరంజీవి కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయేలా వశిష్ఠ( Vashista ) ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
క్రియేషన్స్ పతాకంపై వస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.
మరి 70 ఏళ్ల పాత్రలో మెగాస్టార్ చిరంజీవిని చూసి అభిమానులు తట్టుకోగలరా, ఆ పాత్రను అభిమానులు యాక్సెప్ట్ చేయగలరా అంటూ కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
మెగాస్టార్ ను ఆ ఏజ్ పాత్రలో చూసి తట్టుకోవడం నిజంగా అభిమానుల వల్ల కాదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
పాక్ కు మద్దతుగా నిలిచిన సమంత… వైరల్ అవుతున్న పోస్ట్… ఫైర్ అవుతున్న నేటిజన్స్!