మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) సినిమాలకు పూర్తిగా దూరం అయినట్లేనా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది.ఒకటి రెండు సంవత్సరాల క్రితం నాగబాబు వరుసగా చిన్న హీరోల సినిమాల్లో లేదా స్టార్ హీరోల సినిమాల్లో ఏదో ఒక పాత్ర ను చేస్తూ ఉండేవాడు.
ఇప్పుడు కొత్త సినిమాలకు నాగబాబు కమిట్ అవ్వడం లేదు.అందుకు కారణం నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ లో( Janasena ) అత్యంత క్రియాశీలక నాయకుడు కొనసాగుతున్నాడు.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇటీవలే నాగబాబు కి పార్టీ కి సంబంధించిన కీలక పదవి ని కట్టబెట్టడం జరిగింది.దాంతో నాగబాబు పార్టీ ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు విస్తృతంగా ప్రచారం చేసేందుకు పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయ్యాడు.
అందుకే సినిమాల నుండి ఆఫర్స్ వస్తున్నా కూడా నో చెబుతున్నాడని సమాచారం అందుతుంది.
నాగబాబు యొక్క సినిమాలు ముందు ముందు వస్తాయా లేదా అనే విషయం లో కూడా క్లారిటీ లేదు.భారీ అంచనాల నడుమ రూపొందిన పలు సినిమా ల్లో నాగబాబు గతంలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే.చిన్న సినిమాల్లో కూడా పెద్ద పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు.
పూర్తిగా రాజకీయాల్లోకి నాగబాబు వెళ్లి సినిమాలకు న్నో చెబుతున్న నేపథ్యం మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు నాగబాబు యొక్క పాత్రలను మిస్ అవ్వబోతున్నారు.మళ్లీ సినిమాల్లో నటిస్తాడా అంటే అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చర్చ జరుగుతుంది.
చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాగబాబు హీరో గానే కాకుండా పలు చిన్న పెద్ద పాత్రల్లో కనిపించాడు.హీరో గా సక్సెస్ రాక పోవడంతో చాలా త్వరగా గానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పోయాడు.తనకు ఇచ్చిన ప్రతి ఒక్క పాత్రకు న్యాయం చేసే విధంగా నటించిన నాగబాబు చందమామ సినిమా లో హీరోయిన్ కాజల్ కి తండ్రి పాత్రలో కనబరిచిన నటన అందరిని ఆకట్టుకుంది.ఒక కూతురు తండ్రి పాత్ర కు ఆయన జీవం పోశాడు.
అలాంటి నటన ఇకపై చూడలేము అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.