కాంగ్రేస్ పార్టీ ప్రజాప్రతినిధులు,ముఖ్యనేతల సమావేశం

యాదాద్రి జిల్లా:ఆలేరు నియోజకవర్గ స్థాయి 8 మండలాల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు,కాంగ్రేస్ ఎంపీపీలు,జడ్పీటీసీలు మరియు ముఖ్యనేతలతో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల ఐలయ్య శనివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 6న జరిగిన రైతు సంఘర్షణ సభలో భారత బావి ప్రధాని రాహుల్ గాంధీ తెలంగాణ రైతుల పట్ల చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

కావున ఇంతటి గొప్ప నిర్ణయాన్ని ప్రతి రైతుకు,ప్రతి పల్లెకు చేరవేయాలని సూచించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ,పెట్టుబడి,పంటలకు మద్దతు ధర,ధరణి పోర్టల్ రద్దు తదితర అంశాలు ఆలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి,ప్రతి రైతుకు చేరేవిధంగా కరపత్రాలను,బ్యానర్లను అన్ని మండలాల అధ్యక్షులకు,నాయకులు తీసుకెళ్లాలని సూచించారు.

Meeting Of Congress Party Representatives And Leaders-కాంగ్రేస�

ఫ్లెక్సీలు,కరప్రతాలు ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు,ఎంపీపీలు,జడ్పీటీసీలు నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీలు,జడ్పీటీసీలు, మండల అధ్యక్షులు మరియు ముఖ్యనేతలు పాల్గొన్నారు.

ఆ మూవీలో విలన్ గా కనిపించబోతున్న బన్నీ.. బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!
Advertisement

Latest Yadadri Bhuvanagiri News