ఎర్రగా, బుర్రగా ఉన్నాడని 25 ఏళ్ల కుర్రాడితో ఆంటీ అఫైర్... చివరికి...

ఈ మధ్య కాలంలో కొందరు పెళ్లయి పిల్లలు ఉన్నటువంటి మహిళలు అక్రమ సంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన పిల్లలను కూడా వదిలి పెట్టడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.కాగా తాజాగా ఓ వివాహిత 25 సంవత్సరాలు కలిగిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి తన ప్రియుడితో కలిసి జీవించాలని వెళ్ళిపోయి తనువు చాలించిన ఘటన కన్యాకుమారి జిల్లాలో వెలుగు చూసింది.

 Married Women Commit Suicide With Her Lover In Tamil Nadu Kanyakumari District,-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానికంగా సుభాష్ అనే వ్యక్తి తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో కలిసి కన్యాకుమారి జిల్లాలో నివాసముంటున్నాడు.అయితే సుభాష్ కుటుంబపోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

కానీ సుభాష్ భార్య మాత్రం తన పిల్లలను చూసుకోవడం మరియు ఇంటి పనులను చక్కబెడుతూ ఇంటి పట్టునే ఉండేది.ఈ క్రమంలో సుభాష్ ఉంటున్న ఏరియాలోనే సతీష్ అనే 25 సంవత్సరాలు కలిగిన యువకుడు నివాసముంటున్నాడు.

అయితే సతీష్ అప్పుడప్పుడు సుభాష్ ఇంటికి వచ్చి వెళుతూ వుండేవాడు.ఈ క్రమంలో సుభాష్ భార్యతో సతీష్ కొంతమేర చనువుగా ఉండేవాడు.

Telugu Commit, Affairs, Lover, Married, Marriedcommit, Pregnant, Satish, Subhash

అయితే ఇటీవల కాలంలో సతీష్ సుభాష్ భార్యతో ప్రేమలో పడ్డాడు.ఈ క్రమంలో డబుల్ మీనింగ్ డైలాగులు మరియు పొగడ్తలతో సతీష్ భార్య ని బుట్టలో వేసుకున్నాడు.కానీ వీరిద్దరి ప్రేమ విషయం సుభాష్ తెలియడంతో ఇద్దరినీ పిలిచి మందలించాడు మరోమారు ప్రేమ వివాహేతర సంబంధం వంటి వాటి గురించి ఆలోచిస్తే పోలీసు కేసు పెడతానని బెదిరించాడు.దీంతో భయపడిన సతీష్ ఏకంగా సుభాష్ భార్యని తీసుకొని పరారయ్యాడు.

దాంతో సుభాష్ తన భార్య మరియు సతీష్ కోసం కొంతకాలం పాటు బాగానే వెతికాడు.

Telugu Commit, Affairs, Lover, Married, Marriedcommit, Pregnant, Satish, Subhash

అయినప్పటికీ తన భార్య ఆచూకీ తెలియకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అయితే ఇటీవలే సతీష్ తన ప్రియురాలిని గర్భవతిని చేశాడు.ఏమైందో ఏమోగాని తాజాగా సతీష్ మరియు తన ప్రియురాలు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు.కానీ అప్పటికే సతీష్ ప్రాణాలు కోల్పోయాడు.అలాగే సతీష్ ప్రియురాలు కూడా వారం రోజుల పాటు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఇటీవలే తనువు చాలించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube