Flood Rescue : వీడియో: వరదల నుంచి తల్లి బిడ్డను రక్షించిన వ్యక్తి.. రియల్ హీరో అంటూ..

బ్రెజిల్‌లో( Brazil ) ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది.ఇదొక రెస్క్యూ ఆపరేషన్.

 Mans Quick Reaction Saves Mother And Baby From Flash Floods Video Viral-TeluguStop.com

( Rescue Operation ) దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిగా ఇది ఆన్‌లైన్‌లో చాలా మంది హృదయాలను దోచుకుంది.మార్కోస్ వినిసియస్( Marcos Vinicius ) అని అనే బ్రెజిలియన్ వ్యక్తి, అకస్మాత్తుగా వరదలో చిక్కుకున్న కారు నుంచి తల్లి, ఆమె బిడ్డను రక్షించాడు.

ఈ సమయంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించాడు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో వినిసియస్ వేగంగా పెరుగుతున్న వరదనీటిలో చిక్కుకున్న కారు వద్ద కనిపించాడు.

తన భద్రత గురించి ఆలోచించకుండా, ఏడుస్తున్న పిల్లవాడిని రక్షించడానికి అతను మొదట కారులోకి చేరుకున్నాడు.

జాగ్రత్తగా ఆ చిన్నారిని పక్కనే ఉన్న వ్యక్తికి అప్పగించాడు.ఆపై, పిల్లల తల్లికి సహాయం చేయడానికి వెనక్కి తిరిగాడు.గుండె ఆగిపోయే క్షణంలో తల్లి, బిడ్డను సురక్షితంగా బయటకు తీసుకు రాగలిగాడు మరుక్షణమే వరదనీరులో( Flood Water ) కారు కొట్టుకుపోయింది.

అతడు ఒక్క క్షణం ఆలస్యం చేసిన తల్లి కారుతో సహా వరదల్లో కొట్టుకుపోయి ఉండేది అదే జరిగితే ఆమె బిడ్డ అనాథగా మారుండేది కానీ వినిసియస్ వేగంగా స్పందించి వారిద్దరినీ త్వరగా బయటకు తీసుకురాగలిగాడు.సింగిల్ గా అతడు ఈ పని చేయడం నిజంగా ప్రశంసనీయం.

గుడ్‌న్యూస్_మూవ్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈ వీడియో పోస్ట్ చేసింది.అప్‌లోడ్ చేసినప్పటి నుంచి వీడియో వైరల్‌గా మారింది, దీనికి 8 లక్షల వ్యూస్, 40 వేల లైక్‌లు వచ్చాయి.వినిసియస్ ధైర్య సాహసానికి ప్రజలు తమ విస్మయాన్ని, కృతజ్ఞతలు తెలియజేశారు.చాలా మంది అతన్ని హీరో అని పిలిచారు.సమయానికి వ్యక్తులను రక్షించే సినిమాల్లోని నాటకీయ సన్నివేశాలను కూడా వారు గుర్తు చేసుకున్నారు.ఈ రెస్క్యూ వినిసియస్ ధైర్యసాహసాలను మాత్రమే కాకుండా ఆకస్మిక వరదల అనూహ్య, ప్రమాదకరమైన స్వభావాన్ని కూడా హైలైట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube