ఒక వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన పల్నాడు జిల్లా( Palnadu District ) గురజాల మండలం కొత్త అంబాపురంలో చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.అంబాపురంలో పత్తి రామారావు (71)( Patti Ramarao ) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.
ఇతనికి భార్య సరోజినీ దేవి, కుమారులు కృష్ణ, మోహన్, నరేష్ ఉన్నారు.రామారావు ఆరోగ్య శాఖలో ఉద్యోగ విరమణ చేశారు.
మోహన్, నరేష్ లు అమెరికాలో స్థిరపడ్డారు.కృష్ణ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన నరేష్ ను తిరిగి అమెరికా( America ) పంపేందుకు రామారావు తన భార్య సరోజినీ దేవితో( Sarojini Devi ) కలిసి శుక్రవారం ఉదయం హైదరాబాదుకు వెళ్లారు.ఆ తర్వాత భార్యను తన పెద్ద కుమారుడు కృష్ణ వద్ద దింపి రాత్రి 12 గంటలకు రామారావు తన స్వగ్రామానికి వచ్చాడు.శనివారం సాయంత్రం సుమారుగా 4:30 గంటల సమయంలో ఆ ఇంట్లో పనిచేసే పనిమనిషి శారద వెళ్లి చూసేసరికి కుర్చీలో రామారావు విగతజీవిలా పడి ఉన్నాడు.వెంటనే శారద పోలీసులకు సమాచారం అందించింది.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తెల్లవారుజామున హత్య జరిగినట్లు భావిస్తున్నారు.
రామారావు ఉద్యోగ విరమణ తర్వాత తెలుగుదేశం పార్టీ( TDP ) కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొనేవాడు.ఎప్పుడు గ్రామ తెదేపా నాయకులతో సన్నిహితంగానే ఉండేవాడు.ఎన్నికల సమయంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి, పార్టీ ప్రచారాలలో పాల్గొనేవాడు.
రాజకీయ కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ హత్య ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.