టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని మహేష్ బాబు బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చారు.బాల నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు అనంతరం హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.
ఇలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న మహేష్ బాబు తాజాగా బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో విషయాలను పంచుకున్న మహేష్ బాబు తన కూతురు సితార కొడుకు గౌతమ్ గురించి ప్రస్తావించారు.
ఇప్పటివరకు మహేష్ బాబు నమ్రత దంపతులు వారి పిల్లల కెరియర్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.మహేష్ బాబు కొడుకు గౌతమ్ వన్ నేనొక్కడినే చిత్రం ద్వారా మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను పోషించారు.
ఈ సినిమా పెద్దగా విజయం అందుకోలేకపోయినప్పటికీ నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి.ఇక సినిమాల వైపు వీరి దృష్టి లేకుండా కేవలం వారి చదువుపై శ్రద్ధ చూపారు.
మహేష్ బాబు కూతురు సితార ఇప్పటికి ఒక యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తూ ఆ చానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఎప్పటికైనా తను నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెడతానని తేల్చి చెప్పారు.ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా మహేష్ బాబు తన కెరీర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఎవరి సహాయం లేకుండా తానే కథలను విని సినిమాలను ఎంపిక చేసుకుంటానని ఆ సినిమా విజయాన్ని అపజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తానని తెలిపారు.
బహుశా ఫ్యూచర్ గౌతమ్ కూడా ఇలాగే ఉంటాడని మహేష్ బాబు గౌతమ్ సినీ ఎంట్రీ గురించి హింట్ ఇచ్చారు.మొత్తానికి మహేష్ బాబు మొదటి సారిగా తన కొడుకు ఎంట్రీ గురించి ప్రస్తావించినా ఎప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడతారో మాత్రం తెలియజేయలేదు.
ప్రస్తుతం ఇతర దేశాలలో ఉన్నత చదువులు చదువుతున్న గౌతమ్ చదువులు పూర్తయిన తర్వాతనే ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు అని తెలుస్తోంది.