ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు తీయాలంటే అది అశ్విన్ దత్ గారితో సాధ్యం అయ్యేది ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు మొత్తం పెద్ద హీరోలతోనే ఉండేవి.అవి మంచి విజయాలు అందుకునేవి…కానీ అశ్వినీ దత్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీయార్ హీరోగా తీసిన కంత్రి సినిమా ప్లాప్ అవ్వడం తో చాలా కోట్లు నష్టపోయారు అలాగే ఈ సినిమా తర్వాత మళ్లీ వీళ్ళ కాంబోలో వచ్చిన శక్తి సినిమా భారీ డిజాస్టర్ అయింది…ఇక దీంతో చాలా నష్టాలను చవి చూసిన అశ్విని దత్ చాలా రోజులపాటు సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్నారు…
అయితే తన అల్లుడు అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మహానటి సావిత్రి గారి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా సూపర్ హిట్ అయింది దాంతో అప్పులన్నీ తీర్చేసుకొని మళ్ళీ నార్మల్ గా మారారు.ఇక అప్పటి నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా చాలా సినిమాలకి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రభాస్ హీరో గా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కె సినిమా వస్తుంది ఇది ప్రభాస్ కెరియర్ లోనే హైయేస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది…
ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరో కావడం తో ఈ సినిమా సక్సెస్ తో నాగ్ అశ్విన్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాలని కోరుకుందాం…నాగ్ అశ్విన్ తన మూడవ సినిమాకే ప్రభాస్ తో సినిమా చేసే స్థాయి కి ఎదిగారు అంటే ఆయన గ్రేట్ అనే చెప్పాలి…ప్రభాస్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ చిరంజీవి తో కూడా ఒక సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే అది ఏ రకమైన సినిమా అనేది తెలియాల్సి ఉంది…