జిమెయిల్ అకౌంట్ యాక్సెస్‌ కోల్పోయారా..? అయితే ఇలా చేయండి..!

ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీ-మెయిల్ అకౌంట్ ను వాడుతున్నారు.ఒక్కొక్కరు రెండు అకౌంట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు అనడంలో సందహమే లేదు.

 Lost Gmail Account Access But Do It Like This, Gmail, Account, Access, Technolo-TeluguStop.com

ఎందుకంటే ఇప్పుడు జీమెయిల్ అనేది దేనికైనా సరే తప్పనిసరి అయిపోయింది.స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు కూడా జీమెయిల్‌ ఖాతాను తప్పనిసరిగా ఓపెన్ చేయాలి.

అయితే ఒక్కోసారి మీ జీమెయిల్‌ అకౌంట్ అనేది లాక్‌ అవ్వడం గాని లేదంటే మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌ కోల్పోవడం వంటివి జరిగితే ఎలా రికవరి చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్‌ కు రెండు బిలియన్ల మంది ఖాతాదారులు ఉన్నారు.

మొబైల్ లో గూగుల్, ఇతర సేవలు, డేటా, ఫైల్స్‌ యాక్సెస్‌, షేరింగ్‌ చేయాలంటే జీ-మెయిల్ అకౌంట్ తప్పనిసరి.మరి అలాంటి ముఖ్యమైన జీమెయిల్‌ ఐడీని ఒకవేళ మర్చిపోతే మీరు మీ ఫోన్‌ నంబర్‌తో సైన్ఇన్‌ అవ్వండి.

అలాగే ఫార్గట్ పాస్ వర్డ్ పై క్లిక్ చేసి మీ ఫోన్‌ నంబర్‌తో పాస్‌వర్డ్‌ను మళ్ళీ రీసెట్‌ చేసుకుంటే సరి.ఒకవేళ అలా కూడా అకౌంట్ ఓపెన్ కాకపోతే ఐఫోన్‌, ఐప్యాడ్‌లో నేరుగా గూగుల్‌ ఖాతాతో లాగిన్‌ కావడం ద్వారా జీమెయిల్‌ను పునరుద్ధరించుకోవచ్చు.

ఎందుకంటే ఈ హ్యాండ్ సెట్స్ లో ఎటువంటి ఐడీ, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాల్సిన అవసరం అయితే లేదు కానీ మొబైల్‌ నంబర్‌ వంటి వ్యక్తిగత వివరాలను మాత్రం ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.ఇక ఆండ్రాయిడ్‌ డివైస్‌ లలో అయితే Google Authenticator యాప్‌ను ఉపయోగించి ఖాతాను మళ్ళీ పునరుద్దరించుకోవచ్చు.

అలాగే మీ జీమెయిల్‌ ఒకవేళ లాక్ అయితే మీరు ఎప్పుడు వినియోగించే క్రోమ్‌, సఫారీ బ్రౌజర్‌ను ఉపయోగించండి.అలాగే మీరు అకౌంట్ రికవరీ చేసేటప్పుడు గూగుల్‌ మిమ్మల్ని కొన్ని సెక్యూరిటీ ప్రశ్నలకు అడగవచ్చు.

అడిగిన అన్ని ప్రశ్నలకు మీరు అంతముందు ఇచ్చిన సమాధానాలిస్తూ ముందుకు వెళ్ళండి.

Lost Gmail Account Access But Do It Like This, Gmail, Account, Access, Technology Update, Technology News, Google Authenticator - Telugu Access, Gmail

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube