కోరిన కోరికలు తీర్చే కొత్త కొండ వీరభద్ర స్వామి ఆలయ విశేషాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం!

రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణ ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు నిలయం అని చెప్పవచ్చు.ఈ విధంగా తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం ఒకటి.

 Kotha Konda Veerabhadraswamy Temple Kotha Konda, Veerabhadraswamy Temple, Karimn-TeluguStop.com

నిత్యం ఎంతో మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయ విశేషాలు ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామి వారి మహిమలు.ఆలయ చరిత్ర ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కోరమీసాల వీరభద్ర స్వామి ఆలయం ఉంది.ఇక్కడ మనం ఏదైనా కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి ఒక ప్రత్యేకత ఉంది.ఇక్కడ వెలసిన స్వామి వారు విగ్రహ రూపంలో కాకుండా అర్చామూర్తిగా కోరమీసాలతో వెలసి భక్తులకు దర్శనమిస్తున్నారు.

పురాణాల ప్రకారం ఈ ఆలయ విషయానికి వస్తే కొందరు కుమ్మరులు వంట చెరుకు కోసం కొండపైకి ఎడ్ల బండితో వెళ్లారని వారు వంట చెరుకును తీసుకువచ్చి చూసేసరికి తమ ఎడ్లు మాయమయ్యాయి.అయితే తిరిగి వెళ్లడానికి చీకటి పడడంతో ఆ కుమ్మరులు ఆ కొండపైనే సేద తీరారు.

ఈ క్రమంలోనే వారి కలలోకి వీరభద్రస్వామి కనిపించి తాను కొండపై ఒక గుహలో కొలువై ఉన్నానని తనని కిందకి తీసుకెళ్లి ఆలయం నిర్మించాలని చెప్పారు.ఇలా చేస్తే మీ ఎడ్లు మీకు తిరిగి దక్కుతాయని చెప్పి మాయమయ్యాడు.

ఈ క్రమంలోనే స్వామి వారు కలలో కనిపించి చెప్పిన విధంగానే ఆ కుమ్మరులు గుహలోకి వెళ్లి స్వామివారి విగ్రహాన్ని కిందకు తీసుకు వస్తున్న నేపథ్యంలో స్వామివారికి కాలు విరిగిందని స్థానికులు చెబుతున్నారు.సంతానం లేని వారు స్వామివారికి కోర మీసాలను సమర్పిస్తామని మొక్కుకుంటే వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తులు ఎక్కువగా నమ్ముతారు.అందుకే ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.అదే విధంగా ఈ ఆలయంలో స్వామివారికి మొక్కులు మొక్కి ఆ మొక్కు నెరవేరాలని ఇక్కడ కోడె దూడలను సమర్పించడం మరొక ఆచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube