కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ( Karthi ) వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన జపాన్ సినిమా ద్వారా తన 25వ సినిమా అని పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
కార్తీ హీరోగా నటిస్తున్నటువంటి జపాన్ సినిమా( Japan movie ) తన కెరీర్లు 25వ సినిమా.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని దీపావళి పండుగను పురస్కరించుకొని విడుదలకు సిద్ధమవుతోంది.
ఇలా కార్తీ నటించినటువంటి 25 సినిమాలు పూర్తి కావడంతోఆయన అఖిల భారత అభిమాన సంక్షేమ సంఘం.కార్తీ నిర్వహిస్తున్న ఉళవన్ సేవా ట్రస్ట్( Uzhavan Foundation ) ఆధ్వర్యంలో 25 రోజులపాటు 25 వేల మందికి అన్నదానం కార్యక్రమాన్ని చేయడానికి శ్రీకారం చుట్టారు.
అన్నదానం కార్యక్రమానికి మంగళవారం ఉదయం స్థానిక టీ.నగర్ లోని కార్తీ అభిమాన సంఘం కార్యాలయంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి జపాన్ నిర్మాతలు( Japan Movie Producers ) అయినటువంటి ఎస్ ఆర్.ప్రభు, దర్శకుడు రాజు మురుగన్ విచ్చేసి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఇకపోతే ఒకేసారి 25,000 మందికి అన్నదానం( Annadanam ) చేయాలని కార్తీ అభిమాన సంఘం భావించినప్పటికీ ఇలా ఒకేసారి ఈ స్థాయిలో ఒకే చోట భోజనాలు ఏర్పాటు చేయడం కన్నా 25 రోజులపాటు నగరంలోని కొన్ని ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మంచిదని భావించి ఈ కార్యక్రమాన్ని 25 రోజుల పాటు కొనసాగించబోతున్నారని తెలుస్తోంది.
ఇలా ఈ కార్యక్రమాన్ని 25 రోజుల పాటు కొనసాగించడం వల్ల ఎంతో మంది ఆకలి తీర్చిన వాళ్ళు అవుతాం అంటూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా ఇలా ఇంతమంది ఆకలి తీర్చడం అంటే నిజంగా ఇదొక మంచి విషయమనే చెప్పాలి.ఇక ఈ మధ్యకాలంలో కార్తీ వరుస సినిమాలతో దూకుడు కనబరుస్తున్నారు.
ఈయన నటించిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి తాజాగా పోన్నియన్ సెల్వన్ సినిమా( Ponniyin Selvan ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి కార్తీ మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమా తర్వాత జపాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.