టీటీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఏసీబీ ఇక ఆయన్ని ప్రశ్నించాల్సి ఉంది.అందుకే ఆయన్ని ఐదు రోజుల కస్టడీ కోసం తమకు తమకు అప్పగించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
కోర్టు తన నిర్ణయాన్ని శుక్రవారం తెలియచేస్తుంది.రేవంత్ ఇంటరాగేషన్ చేసేందుకు తమకు ఎక్కువ సమయం అవసరం లేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
ఓ పక్క వీడియో క్లిప్పింగుల ఆధారాలు ఉండటంతోపాటు ఉదయ్, సెబాస్టియన్ అనేవారిని కూడా రేవంత్‌తో పాటు అరెస్టు చేశారు.కరెన్సీ కూడా ఆధారంగా ఉంది.
రేవంత్‌తో పాటు మిగిలిన ఇద్దరిని కూడా ఏసీబీ ప్రశ్నిస్తుంది.ఏసీబీ ఇంటరాగేషన్ ప్రారంభించాకే అసలు కథ మొదలవుతుంది.
ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి.ఇంటరాగేషన్లో బయటపడే వివరాల ఆధారంగా ఈ కేసు అనేక మలుపులు తిరిగే అవకాశముంది.
ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కూడా నిందితుడిగా చేరుస్తారా? లేదా? అనేది ఉత్కంఠగా ఉంది.చంద్రబాబును నిందితుడిగా చేర్చవచ్చని, అందుకు అవకాశం ఉందని కొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు.
అయితే ఇదంతా రేవంత్, మరో ఇద్దరు చెప్పే వివరాల మీద ఆధారపడి ఉంటుంది.ఒకవేళ ఈ కేసులో బాబును చేరిస్తే మాత్రం దేశవ్యాప్తంగా సంచలనమైపోతుంది.
రాజకీయంగా ఆయనకు మాయని గాయమవుతుంది.