సింగంకు పాజిటివ్‌ టాక్‌

‘హృదయకాలేయం’ ఫేం సంపూర్నేష్‌బాబు హీరోగా మంచు విష్ణు నిర్మాణంలో తెరకెక్కిన ‘సింగం123’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకు వెళ్లింది.

 Singham 123 Got Good Response-TeluguStop.com

ఇక తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ షోకు మంచి స్పందన వచ్చింది.రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు పాజిటివ్‌ టాక్‌తో రాబోతుంది.

ఈ సినిమాలో సంపూ చెప్పిన పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌ ఇప్పటికే బుల్లి తెరపై సండది చేస్తున్నాయి.

ఈ సినిమాలో సంపూర్నేష్‌బాబు ఒక పవర్‌ ఫుల్‌(?) పోలీస్‌గా కనిపించబోతున్నాడు.సినిమా ఆరంభం నుండి చివరి వరకు నవ్విస్తూనే ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఈ సినిమాను ప్రముఖ హీరో అయిన మంచు విష్ణు నిర్మించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇంతటి భారీ అంచనాలతో పాటు, పాజిటివ్‌ టాక్‌ కూడా ఉన్న ఈ సినిమా రేపు తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube