ఏ కేసుకూ భయపడను…ఎవ్వరికీ భయపడను…ఇదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్.రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబును కూడా అరెస్టు చేస్తారని, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఇతర నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు బాబుకు కోపం తెప్పించాయి.
దీంతో తాను ఎవ్వరికీ భయపడనని ధైర్యంగా చెప్పారు.టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీఆర్‌ఎస్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచిందని, ఆయన మీద కేసు బుక్ చేస్తారా? అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అక్రమంగా గెలిచిందన్నారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం టీడీపీ ఎమ్మల్యేల ఇళ్ల వద్ద పోలీసు నిఘా పెట్టిందని ఆరోపించారు.తాను గత ముప్పయ్ ఏళ్లుగా నీతి నిజాయితీలతో బతుకుతున్నానని, అందుకే తాను ఎవ్వరికీ భయపడనని అన్నారు.చంద్రబాబు ఫోన్‌తో సహా ఏపీ మంత్రుల, ఇతర నాయకుల ఫోన్లు తెలంగాణ పోలీసులు ట్యాప్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి.
రేవంత్ రెడ్డి కేసు కారణంగా ఇద్దరు చంద్రుల మధ్య దూరం మరింత పెరుగుతోంది.ఒకవేళ ఈ కేసులోకి బాబును కూడా లాగితే టీడీపీ-టీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణలు కూడా జరగొచ్చు.
బాబు రాజకీయంగా గట్టివాడే.కాదనం.
కాని కేసులో బలమైన ఆధారాలు దొరికినప్పుడు ఎలా? అన్నదే ప్రశ్న.చంద్రబాబుకు సంబంధించిన ఆడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
బాబుపై కేసు బుక్ చేయాలని కోర్టు ఆదేశిస్తే చేసేదేమీ లేదు.







