తెలంగాణ హైకోర్టులో బీఎల్ సంతోష్ కు ఊరట

తెలంగాణ హైకోర్టులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు ఊరట లభించింది.41 (ఏ) సీఆర్పీసీ నోటీసులపై న్యాయస్థానం స్టే విధించింది.డిసెంబర్ 5వ తేదీ వరకు స్టే విధిస్తున్నట్లు పేర్కొంది.సిట్ జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని బీఎల్ సంతోష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 Telangana High Court Gives Relief To Bl Santosh-TeluguStop.com

ఈ క్రమంలో బీఎల్ సంతోష్ తరపున న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు.ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేనప్పుడు నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని ఆయన ప్రశ్నించారు.

అదేవిధంగా బీఎల్ సంతోష్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించిన ఏజీ.సంతోష్ ప్రమేయంపై పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.బీఎల్ సంతోష్ విచారణకు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని ఏజీ వాదనలు వినిపించారు.ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం నోటీసులపై స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో భాగంగా బీఎల్ సంతోష్ కు సిట్ అధికారులు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube