జగదీశ్ రెడ్ఢీ...నోరు అదుపులో పెట్టుకో:టిజెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా:విద్యుత్తు కొనుగోలు,విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ముందు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వాస్తవాలు వివరించినందుకే జగదీశ్ రెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతున్నాడని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ హితవు పలికారు.

జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుండి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు, డబ్బులు పెట్టినా బొటాబొటి ఓట్లతో గెలిచిన నీకు కోదండరామ్ ను విమర్శించే కనీస నైతిక అర్హత లేదన్నారు.యాదాద్రి,భద్రాద్రి పవర్ ప్లాంట్లు కాలం చెల్లిన టెక్నాలజీతో కూడిన మిషనరీతో నిర్మిస్తున్నారని, అధిక ధరలతో పక్క రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని తెలంగాణ జన సమితిగా మాత్రమే కాదు, తెలంగాణ జేఏసీగా 2016 నుండే మాట్లాడుతూ ఉన్నామని,ఈ రోజు న్యాయ, సాంకేతిక నిపుణుల సమక్షంలో జరుగుతున్న విచారణలో తమ అవినీతి,అక్రమాల పుట్ట బయటపడుతుందనే భయంతోటే సమస్యను పక్కదారి పట్టించేందుకు అవాక్కులు చవాక్కులు మాట్లాడుతున్నాడని విమర్శించారు.

గులాబీ పార్టీలో పార్టీ వ్యతిరేకులను బెదిరించినట్లుగానే మమ్మల్ని బెదిరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.ఒకవైపు విచారణ కమిషన్ ముందు ఎవరు వాంగ్మూలం ఇస్తే వాళ్ల మీద దాడి చేయడమే పనిగా పెట్టుకున్న నీ ఉలిక్కిపాటుకు కారణం అర్థం అవుతుందని, దొంగతనం బయటపడి ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందోనని బీజేపీ నాయకులతో రహస్య మంత్రాంగం నడుపుతున్న నీకు,కోదండరాం గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత నీకుందా?నిజంగా నీకు ఆ అర్హత ఉంటే కృష్ణా జలాల్లో జరిగిన నష్టంపై ఎందుకు ఇన్నేళ్లు మౌనంగా కూర్చున్నావు?ఈ రోజు నీకు ఉమ్మడి నల్గొండ అభివృద్ధి గుర్తుకొచ్చిందా? కేవలం ఉమ్మడి నల్లగొండలో నీ పార్టీ నాయకులే నీ బట్టలూడపీకే టైం దగ్గరికి వచ్చింది కాబట్టే ఈరోజు నువ్వు నల్లగొండ అనే కొత్త సెంటిమెంట్ డ్రామాతో మాట్లాడుతున్నావని,ఇకపై నీ డ్రామాలు నడవవని ఫైర్ అయ్యారు.

Advertisement
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నీ సత్కరించిన తెలంగాణ రాష్ట్ర మహిళలు..!!

Latest Suryapet News