మేము మంచి చేస్తాం, వాళ్ళు ముంచుతారు : కాంగ్రెస్ పై కవిత మార్క్ సెటైర్

ఎన్నికల ప్రచారం చివరి దశకు చేసుకోవడంతో పార్టీల నేతలు కూడా ప్రచారపు స్పీడును పెంచారు .సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.

 Kavitha Satires On Congress, Kavitha, Congress , Cm Kcr , Ktr , Ts Politics , Sh-TeluguStop.com

ఈ దిశగా తాము మంచి చేస్తామని కాంగ్రెస్ ముంచుతుందని కెసిఆర్ ( CM kcr )తనయ చేసిన వాఖ్యలు చర్చనీయాంశం గా మారాయి.కాంగ్రెస్కు అవసరమైన ప్రతిసారి తెలంగాణ అండగా నిలిచిందని కానీ తెలంగాణకు అవసరమైనప్పుడు మాత్రం కాంగ్రెస్ నిలబడలేదని ముందుగా ప్రకటించిన తెలంగాణను కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్లనే అనేకమంది ఆత్మబలిదానంలో చేశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

బోధన్ నియోజకవర్గంలోని నవీపేటలో బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే శాకీల్ కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత( Mlc kavitha ) ఈ వ్యాఖ్యలు చేశారు .

Telugu Cm Kcr, Congress, Karnataka, Kavitha, Rahul Gandhi, Revanth Reddy, Shakee

కాంగ్రెస్ హయాంలో మాట్లాడితే శాంతి బద్రతల సమస్యలు, మత కల్లోలాలు ఉండేవని, గత తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్కసారైనా అలాంటి సమస్య తలెత్తిందా అంటూ ఆమె ప్రజలను ప్రశ్నించారు కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రశాంతంగా ఉందని, ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారని ఇలాంటి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, మనకు మంచి చేసేవాళ్లను సరిపోతారని ముంచే వాళ్ళు వద్దంటూ ఆమె ప్రజలకు చెప్పుకొచ్చారు.

Telugu Cm Kcr, Congress, Karnataka, Kavitha, Rahul Gandhi, Revanth Reddy, Shakee

ప్రతిసారి చుట్టపు చూపులా బోధన్ కు వచ్చి తిరిగి హైదరాబాదుకు వెళ్లి బిర్యాని తిని ఢిల్లీకి వెళ్లిపోతారని, ప్రతిసారి లాగా ఈసారి కూడా తెలంగాణ ఆతిధ్యం స్వీకరించి వెళ్లిపోవాలని ఆమె సూచించారు.తెలంగాణ ప్రజలను వంచించడం కోసమే కాంగ్రెస్ బూటకపు హామీలను ఇస్తుందని ఇంతకుముందు కర్ణాటకలో( Karnataka ) అధికారం లోకి వచ్చిన ఆ పార్టీ ఏ మేరకు హామీలను అమలు చేస్తుందో మనం చూస్తున్నామని, మోసం చేసిన కాంగ్రెస్పై కర్ణాటక ప్రజలు తిరగబడుతున్నారని తెలంగాణకు ఆ ధుస్థితి వద్దని ఆమె చెప్పుకొచ్చారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube