కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డితో జూపల్లి కీలక భేటీ..!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వరుసగా కాంగ్రెస్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో జూపల్లి భేటీ అయ్యారు.ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలుస్తోంది.

కాగా జూపల్లి పార్టీ ముఖ్యనేతలను కలుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో ఆయన చేరిక తథ్యమనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే నిన్న మల్లు రవితో జూపల్లి సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే.

నాన్నలేని లోటును ఆమె తీర్చారు.... ఎమోషనల్ అయిన ఎన్టీఆర్! 
Advertisement

Latest Latest News - Telugu News