పాత్రికేయులు ఎంసిఎంసిపై అవగాహన కలిగి ఉండాలి

సూర్యాపేట జిల్లా:జిల్లాలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పాత్రికేయ ప్రతినిధులు ఎంసిఎంసిపైపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస రాజు అన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.

వెంకట్రావ్ అదేశాల మేరకు ఎంసిఎంసిపై ప్రింట్ అండ్ ఎలాక్ట్రానిక్ మీడియాకి ప్రతినిధులకు రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్స్ వి.రమేష్,పి.వెంకటేశ్వర్లు,సిహెచ్.

శ్రీనివాస్ లతో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా దినపత్రికల్లో పెయిడ్ న్యూస్,ఎలక్ట్రానిక్ మీడియా,కేబుల్ నెట్ వర్క్ ప్రకటనలు కమిటీ పరిశీలిస్తోందని అన్నారు.

అదే విధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు 3 రోజులు ముందుగా, గుర్తింపు లేని పార్టీలు 7 రోజుల ముందు ప్రకటనల కొరకు అనుమతి తీసుకోవాలన్నారు.రోజువారీ వచ్చే ప్రకటనలను ఎన్నికల రేట్ల ప్రకారంగా అంచనా వేసి తదుపరి చర్యలు తీసుకుంటారు.

Advertisement

అభ్యర్థి నామినేషన్ వేసిన రోజు నుండి ఖర్చులను షాడో రిజిస్టర్ నందు నమోదు చేస్తారు.స్వీప్ కార్యక్రమం ద్వారా ఎన్నికల గురించి ప్రజలలో అవగాహన కల్పించాలి.

ఎగ్జిట్ పోల్ ఎన్నికలకు ముందు 48 గంటలలోపు ప్రచురుణ చేయరాదు.పోలింగ్ కి రెండు రోజుల ముందు వార్త పత్రికలలో ప్రచురించే ప్రకటనల కొరకు ముందస్తు ప్రి సర్టిఫికెషన్ అనుమతి తీసుకోవాలి.

వాస్తవ వార్తలను మాత్రమే ప్రచురించాలి.ఊహజనీత వార్తలను పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించకూడదన్నారు.

తదుపరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంసిఎంసి విధివిధానాలపై వివరించారు.ఈ సమావేశంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

సినిమా ఇండస్ట్రీ లో అసలేం జరుగుతుంది...ఎలాంటి కథలు సక్సెస్ అవుతున్నాయి...
Advertisement

Latest Suryapet News