బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల నుండి బీజేపీలో చేరికలు...!

సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని,పేదవాడి సొంతింటి కల నెరవేరాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు( Sankineni Venkateswara Rao )అన్నారు.

శుక్రవారం సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని లక్ష్మీ తండ గ్రామంలో బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల నుండి లునావత్ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో 100 మంది సంకినేని వెంకటేశ్వరరావు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.

వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.బీజేపీ( BJP )లో చేరిన వారిలో లునావత్ గణేష్,సాగర్,జాటోత్ కళ్యాణ్,బానోత్ బేబీ, జీవన్,వినోద్,శ్రీను,శంకర్, పవన్,రాము తదితరులు ఉన్నారు.

Joining BJP From BRS And Congress Parties.., BJP , BRS, SURYA PET , Sankineni V

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెన్న శశిధర్ రెడ్డి,జిల్లా నాయకులు ఉప్పు శ్రీనివాస్,సలిగంటి వీరేంద్ర, మండల నాయకులు ఇంద్రకంటి శంకర్, మొండికత్తి శివాజీ, మామిడి వెంకన్న,బోర రమేష్ యాదవ్,మహిళా నాయకురాలు అనసూర్య, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా
Advertisement

Latest Suryapet News