జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సంస్కారం గురించి పవన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
పవన్ అప్పుడే ఊగిపోతాడు, అప్పుడే సాగిలపడతారని విమర్శించారు.చెప్పులు పట్టుకుని బూతులు మాట్లాడినప్పుడు సంస్కారం ఏమైందని ప్రశ్నించారు.
పవన్ హద్దులు మీరి మాట్లాడుతున్నారన్నారు.వాలంటీర్ల గురించి పవన్ దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.వాలంటీర్ వ్యవస్థను ఎందుకు రద్దు చేయాలని ప్రశ్నించారు.