రివ్యూ: జై లవకుశ
టైటిల్: జై లవకుశ నటీనటులు: నందరి తారకరామారావు, రాశీఖన్నా, నివేదా థామస్, పోసాని కృష్ణమురళీ, బ్రహ్మాజీ, ప్రదీప్ రావత్, జయప్రకాష్‌రెడ్డి, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్ తదితరులుమ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: చోటా కె.నాయుడుఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజునిర్మాత: నందమూరి కళ్యాణ్రామ్దర్శకత్వం: కేఎస్.రవీంద్ర (బాబి)రన్ టైం: 155 నిమిషాలుసెన్సార్ రిపోర్ట్: యూ / ఏరిలీజ్ డేట్: 21 సెప్టెంబర్, 2107
టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ లాంటి హ్యాట్రిక్ హిట్లతో కెరీర్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ.కెరీర్‌లోనే ఫస్ట్ టైం ఎన్టీఆర్ జై, లవ, కుశ అనే మూడు పాత్రల్లో నటించడంతో పాటు రూ.100 కోట్లకు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ జరగడంతో సినిమాపై మంచి హైప్ వచ్చింది.ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు పవర్, సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాల దర్శకుడు కేఎస్.
రవీంద్ర (బాబి) దర్శకత్వం వహించారు.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు భారీ అంచానల మధ్య వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా ఎలా ఉందో తెలుగుస్టాప్.కామ్ సమీక్షలో చూద్దాం
స్టోరీ:
అన్నదమ్ములైన జై, లవ, కుశల తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్లు చిన్నప్పుడు మేనమామ (పోసాని) దగ్గర పెరుగుతారు.వీరిలో జైకు నత్తి ఉండడంతో తన సోదరులతో పాటు మిగిలిన వాళ్ల నుంచి కాస్త వివక్షకు గురవుతాడు.దీంతో అతడు వీళ్లందరిపై కోపం పెంచుకుంటాడు.ఈ టైంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌లో ముగ్గురూ విడిపోతారు.కట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాత పెరిగి పెద్దవాళ్లు అవుతారు.
వీరిలో లవ అమాయకుడు.వీడు బ్యాంక్ మేనేజర్ అవుతాడు.
కుశ పెద్ద కన్నింగ్ గాడిగా మారతాడు.జనాలను మోసం చేయడం, దొంగతనాలు చేయడమే మనోడి వృత్తి.
ఇక జై మాత్రం విలన్‌గా మారి తన కంటూ ఓ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుంటాడు.రావన్ ఎంపీగా పోటీ చేస్తూ పాలిటిక్స్‌లో రాణించాలనుకుంటాడు.
అలాంటి రావన్‌కు తన సోదరుల గురించి తెలుస్తుంది.సోదరుల మీద పగతో ఉన్న రావన్ తన సోదరులు అయిన లవ, కుశలను ఏం చేశాడు ? చివరికి జై, లవ, కుశలు మళ్ళీ కలుసుకున్నారా ? మధ్యలో ప్రియ (రాశీఖన్నా), తపస్వి (నివేద)లు ఎవరు ఎవరితో ప్రేమలో పడతారు ? చివరకు ఈ కథ ఎలా మలుపులు తిరిగి ఎలా ముగిసింది ? అన్నదే ఈ సినిమా స్టోరీ
నటీనటుల పెర్పామెన్స్ :
ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లేదు.ఈ సినిమాలో మూడు క్యారెక్టర్లలోను మూడు వైవిధ్యమైన రోల్స్‌తో ప్రేక్షకుల చేత వావ్ అనిపించాడు.ఇక జై క్యారెక్టర్ అయితే సీనియర్ ఎన్టీఆర్‌ను గుర్తు చేయడంతో పాటు తారక్‌లోని నట విశ్వరూపాన్ని గుర్తు చేసింది.
జై క్యారెక్టర్‌లో నవయుగ రావణుడిగా ఇరగదీసేశాడంతే.వెండితెరపై చూస్తున్నంతసేపూ ఆ పాత్రల్లోనే లీనమైపోతామే తప్ప.
తారక్ మాత్రం అస్సలు కనిపించడు.రాశీఖన్నా, నివేదా థామస్‌లు అందంగా కనిపించడంతోపాటు అభినయంతోనూ ఆకట్టుకున్నారు.
ఫస్టాఫ్‌లో రాశీ, సెకండాఫ్‌లో నివేదా తమ మార్క్ యాక్టింగ్‌తో ప్రత్యేకత చాటుకున్నారు.రోనిత్ రాయ్ విలనిజాన్ని బాగా పండించాడు.
సాయికుమార్, పోసాని తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.స్పెషల్ సాంగ్‌లో నటించిన తమన్నా హాట్ అందాలతో ఓ ఊపు ఊపేసింది.
డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్:
సినిమాలో అన్ని టెక్నికల్ విభాగాలు బాగా పనిచేశాయి.చోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా చూపించింది.దేవిశ్రీ పాటలు ఇప్పటికే హైలెట్ కాగా ఆర్ ఆర్ సినిమాను బాగా ఎలివేట్ చేసింది.
కోటగిరి, తమ్మిరాజు ఎడిటింగ్ కొన్ని చోట్ల కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది.ఓవరాల్‌గా సినిమాను మరో 7-10 నిమిషాల వరకు ట్రిమ్ చేయొచ్చు.ఆర్ట్ వర్క్ బాగుంది.కళ్యాణ్ రామ్ నిర్మాణ విలువలకు వంక పెట్టడానికి లేదు.
తమ్ముడితో తొలిసారి సినిమా చేసినందుకు ఏమాత్రం వెనకాడకుండా భారీ ఖర్చు చేశాడు.ఇక దర్శకుడు బాబీ తాను రాసుకున్న స్టోరీని వెండితెరపై అద్భుతంగా మలచడంలో సక్సెస్ అయ్యాడు.
ఎన్టీఆర్ తనకు ఎలా కావాలో అలా వాడుకున్నాడు.ఓవరాల్‌గా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చేసేశాడు.
బాబి తెరపై సినిమాను బాగా ప్రజెంట్ చేయడంలో కోన వెంకట్, చక్రవర్తి స్క్రీన్ ప్లే కూబా సూపర్బ్‌గా ఉంది
ప్లస్ పాయింట్స్ (+):– ఎన్టీఆర్ నట విశ్వరూపం– ఆల్ టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్– కళ్యాణ్‌రామ్ నిర్మాణ విలువలు– సెకండాఫ్
మైనస్ పాయింట్స్ (-):– కొన్ని చోట్ల సాగదీత– రన్ టైం
ఫైనల్ పంచ్:ఎన్టీఆర్ నట విశ్వరూపం జై లవకుశ