తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి ( Revanth Reddy )అనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, తన మార్క్ పాలన ఎలా ఉండబోతుందో అందరికీ అర్థమయ్యేలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, కొన్ని కొన్ని వ్యవహారాల పైన దృష్టి సారించారు.
ఇప్పుడు వాటిపై విచారణలు చేయిస్తూ, అప్పటి ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.
పనిలో పనిగా డ్రగ్స్ వ్యవహారం పైన రేవంత్ ఫోకస్ చేశారు . ఈ మేరకు అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ దందా తెలంగాణలో జరగడానికి వీల్లేదని అధికారులకు గట్టిగా చెప్పారట.
అప్పట్లో టాలీవుడ్ ( Tollywood ) ను ఒక కుదుపు కుదిపిన డ్రగ్స్ వ్యవహారాన్ని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు .అప్పట్లో టాలీవుడ్ సెలబ్రెటీలు చాలామంది ఈ డ్రగ్స్ దందాలో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది.దీనికి తగ్గట్లుగానే కొంతమంది సినీ ప్రముఖులు సిట్ విచారణకు హాజరు కావడం, ఆ తరువాత కొంతమంది సినీ హీరోలు , ప్రముఖులు అరెస్ట్ కాబోతున్నారనే హడావుడి జరిగింది .అయితే అకస్మాత్తుగా ఈ వ్యవహారం సైలెంట్ అయిపోవడం, టాలీవుడ్ ప్రముఖులంతా బీఆర్ఎస్ కీలక నాయకులతో సన్నిహితంగా మెలగడం, ఆ పార్టీకి మద్దతు పలకడం వంటివి ఎన్నో చోటు చేసుకోవడంతో దీనిపై అనేక విమర్శలు వ్యక్తం అయ్యాయి.
అప్పట్లోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి డ్రగ్స్ వ్యవహారాలపై పోరాటాలు చేశారు.కోర్టుల్లో కేసులు వేశారు.ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఆ డ్రగ్స్ వ్యవహారాన్ని తేల్చాలని నిర్ణయించుకున్నారు.ఇప్పుడు ఈ డ్రస్ వ్యవహారంపై రేవంత్ సీరియస్ గా ఉండడం విచారణకు ఆదేశించడంతో టాలీవుడ్ ప్రముఖులు రేవంత్ తో భేటీ అయ్యి ఈ వ్యవహారంపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే టాలీవుడ్ తీరుపై కొత్తగా సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komati Reddy Venkata Reddy ) సీరియస్ గానే ఉన్నారు.తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత టాలీవుడ్ నుంచి తనకు ఎవరు ఫోన్ చేయలేదని , ఒక దిల్ రాజు మాత్రమే ఫోన్ చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం, సినిమా ఆటోగ్రాఫ్ మంత్రి సీరియస్ గా ఉండడం వంటి పరిణామాలతో సినీ ప్రముఖులంతా రేవంత్ తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసే ఆలోచనలో ఉన్నారట.