ఆన్‌లైన్‌లో విలువైన ప్రొడక్ట్స్ ఆర్డర్ పెడితే చవకైన సబ్బులు, ఇటుక పెళ్ళలు, రాళ్లు, లేదా డూప్లికేట్ ప్రొడక్ట్స్ రావడం సర్వసాధారణం.బాగా పేరున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలలో కూడా ఈ తరహా చేదు అనుభవాలు, ఆన్‌లైన్ స్కామ్‌లు( Online Scams ) కస్టమర్లకు ఎదురవుతుంటాయి.
తాజాగా ఇలాంటి షాకింగ్ అనుభవం యష్ ఓజా అనే అమెజాన్ కస్టమర్‌కి ఎదురయ్యింది.అతను ఇటీవల సోనీ XB910N వైర్‌లెస్ హెడ్‌ఫోన్లను( Sony XB910N Wireless Headphones ) ఆర్డర్ చేశాడు.
అయితే దానికి బదులుగా టూత్‌పేస్ట్ ట్యూబ్‌ను అందుకున్నాడు.
ప్యాకేజీ వెలుపల బాగానే కనిపించింది కానీ అది ఓపెన్ చేసి చూస్తే అందులో టూత్‌పేస్ట్( Tooth Paste ) మాత్రమే ఉంది.
మిగతా బాక్స్ అంతా చెక్ చేయగా సోనీ బ్రాండింగ్, డాక్యుమెంట్స్ కనిపించాయి.కానీ హెడ్‌ఫోన్స్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.దాంతో కస్టమర్ యష్( Yash ) గుండెలదిరాయి.ఆ స్కామ్‌ను నిరూపించడానికి కస్టమర్ అన్‌బాక్సింగ్ వీడియోను కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు.

ఆన్‌లైన్‌లో హై-వాల్యూ గల వస్తువులను ఆర్డర్ చేసేటప్పుడు రాంగ్ లేదా చీప్ ప్రొడక్ట్స్ రావడం ఎక్కువ అవుతుంది.తాజాగా మరొక సంఘటన ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.యష్ వీడియోకు ప్రతిస్పందనగా, అమెజాన్( Amazon ) క్షమాపణలు చెప్పింది.హెల్ప్ కోసం డైరెక్ట్ మెసేజ్ (DM) ద్వారా వారిని సంప్రదించమని కోరింది, ఆర్డర్ వివరాలు వ్యక్తిగత సమాచారం కాబట్టి వాటిని పబ్లిక్‌గా షేర్ చేయవద్దని సలహా ఇచ్చింది.

అయితే ఈ వీడియో చూసిన కొందరు మాత్రం సదరు కస్టమర్ ఆల్రెడీ సీల్ తీసి హెడ్ ఫోన్స్ పక్కన పెట్టేసి టూత్ పేస్ట్ అందులో ఉంచేసి నాటకాలు ఆడుతున్నాడని ఆరోపించారు.ఏది ఏమైనా అమెజాన్ ఈ ఫిర్యాదుపై ప్రస్తుతం దర్యాప్తుగా జరుపుతోంది.నిజానిజాలు త్వరలోనే బయటపడే అవకాశం ఉంది.







