జగన్ వ్యూహాన్నే బీజేపీ కూడా అమలు చేస్తోందా ?

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే జగన్ వ్యూహాన్నే బీజేపీ కూడా అమలు చేస్తోందా అనే డౌట్ రాకమానదు.ఎందుకంటే పొత్తుల విషయంలో వైఎస్ జగన్ మొదటి నుంచి ఒకే విధానాన్ని అనుసరిస్తున్నారు.

 Is Bjp Following Jagan? , Bjp, Ycp, Ap Politics , Ys Jagan, Chandra Babu Naidu,-TeluguStop.com

తనకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని, తన పొత్తు జనంతోనే అని చెబుతూ వచ్చారు.తనను ఓడించేందుకు దుష్ట చతురష్టం ఏకమౌతోందని, అయినప్పటికి తాను ఏ మాత్రం భయపడనని, తనకు దేవుడి ఆశీస్సులు, ప్రజల అండదండాలు తోడుగా ఉన్నాయని.

ఇలా సెంటిమెంట్ అస్త్రాలను సంధించి ప్రజల్లో సింపతీ సంపాధించుకునే విధంగా ప్రయత్నిస్తున్నారు వైఎస్ జగన్( YS Jagan Mohan Reddy ).నిజానికి సింపతీ రాజకీయాన్ని జగన్ వాడుకున్నంతగా ఇంకెవరు వాడుకోరేమో అంటే అతిశయోక్తి కాదు.

Telugu Ap, Chandra Babu, Pawan Kalyan, Ys Jagan-Politics

ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వాటన్నిటిని తనకు అనుకూలంగా మార్చుకోవడం జగన్ కు తెలిసినంతగా మరెవరికి తెలియదని చెప్పడంలో ఏ మాత్రం సదేహం లేదు.ఇప్పుడు ఇదే విధానాన్ని బీజేపీ అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.నిన్న మొన్నటి వరకు పొత్తుల విషయంలో ఎప్పుడు వార్తల్లో నిలిచిన బీజేపీ ఇప్పుడు తమ పొత్తు జనంతోనే అని సరికొత్త చర్చకు తెర తీసింది.ప్రస్తుతం బీజేపీ జనసేన పార్టీతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.

వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలంటే ఈ రెండు పార్టీలు టీడీపీతో కలవాల్సిన పరిస్థితి.టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిస్తేనే వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయగలవు.

Telugu Ap, Chandra Babu, Pawan Kalyan, Ys Jagan-Politics

అయితే టీడీపీ విషయంలో నిన్న మొన్నటి వరకు కస్సు బుస్సు మన్న బీజేపీ ఇప్పుడు పొత్తుకు రెడీ అవుతోందని పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగానే చర్చలు నడుస్తున్నాయి.దానికి తోడు ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ పెద్దలు తీవ్ర విమర్శలతో విరుచుకు పడడంతో టీడీపీతో బీజేపీ దోస్తీ ఖాయమనే భావించారంతా.ఇంతలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల మాట్లాడుతూ తమ పొత్తు జనంతోనే అంటూ వ్యాఖ్యానించారు.దీంతో జగన్ మాదిరి బీజేపీ కూడా ఒంటరిగా బరిలోకి దిగనుందా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

అయితే ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదనేది అందరికీ తెలిసిన విషయమే.మరి జనం తోనే తమ పొత్తు అని కమలనాథులు చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి ? ఇంతకీ పొత్తుల విషయంలో బీజేపీ ఏ ఆలోచిస్తుంది అనేది విశ్లేషకులకు సైతం అంతుచిక్కడం లేదు.మరి ఏపీ విషయంలో కాషాయ పార్టీ వ్యూహాలు ఎలా ఉన్నాయో ముందు రోజుల్లో బహిర్గతం కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube