కెనడాలో భారతీయ విద్యార్ధి దారుణ హత్య.. 8 నెలల క్రితమే స్టూడెంట్ వీసా, అంతలోనే ఇలా

కెనడాలో 22 ఏళ్ల భారతీయ విద్యార్ధి హత్యకు గురయ్యాడు.బుధవారం అల్బెర్టా ప్రావిన్స్‌లోని డౌన్‌టౌన్ ఎడ్మాంటన్ పార్కింగ్‌లో అతనిని ఓ పదునైన ఆయుధంతో హత్య చేశారు.

 Indian Student From Punjab's Malerkotla Killed In Canada , Jashandeep Singh Man-TeluguStop.com

మృతుడిని పంజాబ్‌( Punjab )లోని మలేర్‌కోట్లలోని బద్లా గ్రామానికి చెందిన జషన్‌దీప్ సింగ్ మాన్‌( Jashandeep Singh Mann )గా గుర్తించారు.ఇతను 8 నెలల క్రితం అంతర్జాతీయ విద్యార్ధిగా కెనడాకు వచ్చాడు.

ఈ ఘటనకు సంబంధించి ఎడ్మాంటన్ పోలీసులు 40 ఏళ్ల ఎడ్గార్ విస్కర్‌పై సెకండ్ డిగ్రీ హత్య కేసు అభియోగాలు మోపారు.హత్య తర్వాత నిందితుడు ఘటనా స్థలంలోనే ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

Telugu Canada, Jashandeepsingh, Malerkotla, Punjab, Jaishankar, Sultanpur-Telugu

హత్య కోసం బాక్స్ కట్టర్‌ను ఉపయోగించినట్లుగా పోలీసులు తెలిపారు.మృతుడు , నిందితుడికి గతంలో ఎలాంటి పరిచయం లేదని పోలీసులు చెప్పారు.జషన్‌దీప్ తండ్రి భర్పూర్ సింగ్ మాజీ సర్పంచ్.దీంతో ఆయన తన కుమారుడి మరణానికి దారితీసిన కారణాలను కెనడా పోలీసులు విచారించాలని డిమాండ్ చేశారు.పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి ప్రిత్‌పాల్ కౌర్ బద్లా .జషన్‌దీప్ మృతదేహాన్ని కెనడా నుంచి భారత్‌కు తరలించడానికి సహాయం చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

Telugu Canada, Jashandeepsingh, Malerkotla, Punjab, Jaishankar, Sultanpur-Telugu

విదేశాల్లో స్థిరపడిన భారతీయ యువతపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.ఫతేఘర్ సాహిబ్ ఎంపీ డాక్టర్ అమర్‌సింగ్ బొపరాయ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌( S Jaishankar )తో ఈ సమస్యపై ప్రస్తావించారు.జషన్‌దీప్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయడానికి కెనడాలోని అధికారులతో సమన్వయం చేసుకుంటానని మంత్రి తనకు హామీ ఇచ్చారని బొపరాయ్ పేర్కొన్నారు.జషన్‌దీప్ మరణంతో బద్లా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కాగా.గత నెలలో పంజాబ్‌లోని కపుర్తలా జిల్లా సుల్తాన్‌పూర్ లోధి సబ్ డివిజన్‌లోని మసీతాన్ గ్రామానికి చెందిన సాహిల్ ప్రీత్ సింగ్‌ ( Sahil Preet Singh )అనే యువకుడు అమెరికాలో ఓ స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి మృతి చెందాడు.

ముగ్గురు తోబుట్టువులలో పెద్దవాడైన సాహిల్ ఆ కుటుంబానికి ఆధారం.నీటిలో మునిగిపోతున్న స్నేహితుడిని కాపాడే ప్రయత్నంలో సాహిల్ మరణించినట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube