కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులపై అక్రమ కేసులా...?

సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, న్యాయవాది,బీఆర్ఎస్ నేత నగేష్ రాథోడ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రజల పక్షాన పోరాడుతున్న తెలంగాణ శంకర్ గౌడ్ ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

వాస్తవాలను ప్రజలకు చూపిస్తున్న జర్నలిస్టులపై దాడులు సమంజసమా? జర్నలిస్టుల అరెస్టుపై వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణలోని జర్నలిస్టులపై దాడులు ఆపకుంటే ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించి తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులకు రక్షణగా నిరసన కార్యక్రమాలను చేస్తామన్నారు.

Illegal Cases Against Journalists During Congress Rule, Illegal Cases ,journalis

Latest Suryapet News