గంజాయి తరలింపు కేంద్రంగా హుజూర్ నగర్

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంగా గంజాయి తరలింపు కొనసాగుతోంది.

ఇటీవల రామస్వామి గుట్ట వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని,300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే,సోమవారం మరో యువకుడు అక్రమంగా గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు.

హుజూర్ నగర్ ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గోవిందపురం గ్రామానికి చెందిన కాళ్ళతెరిపి గోపి(25) తండ్రి నర్సయ్య అను యువకుడు మఠంపల్లి క్రాస్ రోడ్డు వద్ద సోమవారం గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు.అతనిని పోలీసు స్టేషన్ తీసుకెళ్లి విచారించగా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని కోదాడ క్రాస్ రోడ్ వద్ద దద్దనాల చెరువుకు ప్రాంతానికి చెందిన పరిమి ప్రభు @ ప్రభుజీ అనే వ్యక్తి నుండి 2000 రూపాయలకు గంజాయి కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు.

Huzur Nagar Is The Hub Of Ganja Movement-గంజాయి తరలింప�

ప్రస్తుతం ప్రభు పరారీలో ఉన్నట్లు ఎస్సై చెప్పారు.

ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా
Advertisement

Latest Suryapet News