ఒక తాగుబోతు భర్త చేసిన పైశాచికత్వానికి ఆరుగురు సజీవదహనమయ్యారు.ప్రస్తుతం ఈ వార్త అందరినీ కలిచి వేస్తోంది.
చనిపోయిన వారిలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.చేయని తప్పుకి అభం శుభం తెలియని చిన్నారులు సజీవదహనం కావడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ సంఘటన కర్ణాటకలోని కొడుకు జిల్లాలో కనూరు గ్రామంలో జరిగింది.పూర్తి వివరాలు తెలుసుకుంటే.
కనూరు గ్రామానికి చెందిన బోజ అనే వ్యక్తి మద్యానికి బానిసై తన భార్య బేబీ ని చిత్రహింసలు పెడుతున్నాడు.దీంతో భర్త పెట్టే బాధలు భరించలేక బేబీ తన సోదరుడు అయిన మంజు ఇంటికి వెళ్ళిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న తాగుబోతు భర్త తన బావమరిది ఇంటికి వెళ్లి పెద్ద గొడవ పెట్టుకున్నాడు.తన భార్యను తన ఇంటికి పంపించాలని తన బావమరిది పై కూడా వాగ్వాదానికి దిగాడు.
కానీ మంజు మాత్రం బోజ తో కలిసి ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది.దీంతో కోపంతో రగిలిపోయిన సదరు భర్త అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.కానీ మళ్లీ అర్ధరాత్రి సమయంలో పెట్రోల్ డబ్బా తీసుకొచ్చి.తన బావ మరిది ఇంటి తలుపుకి తాళం వేసి.
ఆపై ఇంటి పై కప్పు ఎక్కి.పెంకులు తీసేసి.
ఇంటి లోపలికి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.అయితే అర్థరాత్రి సమయం కావడంతో మంజు, బేబీ తో సహా వారి కుటుంబ సభ్యులు కూడా గాఢ నిద్రలో ఉన్నారు.
ఐతే క్షణాల్లోనే మంటలు అంటుకొని ఇంటి చుట్టూ దట్టమైన పొగ ఆవహించడంతో లోపల ఉన్న వారు బయటకు రాలేక.గాలి ఆడక నరక యాతన పడ్డారు.ఈలోగా స్థానికులు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు.కానీ అప్పటికే బోజ భార్య బేబీ(40) తో సహా సీత(45) అనే మహిళా, ప్రార్థన(6) అనే మరొక చిన్నారి మంటల్లో సజీవ దహనమయ్యారు.
పోలీసులు మంటలను అదుపులోకి తెచ్చి లోపల ఉన్న ఐదుగురిని కేర్ ఆస్పత్రికి తరలించారు.కానీ అప్పటికే తీవ్ర గాయాలపాలైన ముగ్గురు చిన్నారులు చికిత్స పొందుతూ నూరేళ్ళు నిండకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.
బావమరిది మంజు పిల్లలైనా విశ్వాస్ (7), ప్రకాష్ (6) తో పాటు మరొక చిన్నారి ఆస్పత్రిలో చనిపోయారని పోలీసులు చెప్పారు.ఘటనలో గాయపడిన మరో నలుగురు మైసూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే ఈ ఘటన కి కారకుడైన బోజ కోసం పోలీసులు గాలిస్తున్నారు.