దర్శకులు విలన్లుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పుడు సంగీత దర్శకుడు కోటి మొదటిసారిగా తెరపై విలన్‌గా నటించాడు.
పగ పగ పగ చిత్రంతో కోటి విలన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అభిలాష్ సుంకర హీరోగా పగ పగ పగ చిత్రంతో పరిచయం అయ్యాడు.
సత్యనారాయణ సుంకర నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.
కథ:
పగ పగ పగ చిత్రం బెజవాడలోని బెజ్జోని పేటను ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు.అక్కడ ఒకసారి డీల్ కుదిరితే.
అవతలి వాడి శాల్తీ గల్లంతవ్వాల్సిందే.ఈ కథ అంతా కూడా 1985, 90, 2007 ప్రాంతంలో జరుగుతుంది.
బెజ్జోనీ పేటలో జగ్గూ (కోటి), కృష్ణ (బెనర్జీ) సెటిల్మెంట్‌లో హత్యలు చేస్తూ ఉంటారు.స్నేహితులైన జగ్గూ, కృష్ణలు పోలీస్‌ను చంపిన కేసులో కాస్త కంగారు పడతారు.
దీంతో తన స్నేహితుడు జగ్గూ కోసం కృష్ణ అరెస్ట్ అవుతాడు.నీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతాను అని కృష్ణని జగ్గూ మాటిస్తాడు.
ఆ సమయంలోనే జగ్గూ జీవితం పూర్తిగా మారుతుంది.తనకి కూతురు సిరి (దీపిక ఆరాధ్య) పుడుతుంది.
ఆ తరువాత జగ్గూ తన కుటుంబం, తన సంపాదన అంటూ బిజీగా మారిపోతాడు.చివరకుగా పెద్ద వ్యాపారవేత్తగా మారిపోయి జగదీష్ ప్రసాద్‌గా చెలామణి అవుతాడు.కానీ కృష్ణ ఫ్యామిలీ మాత్రం కష్టాలు పడుతూనే ఉంటుంది.కృష్ణ కొడుకు అభి (అభిలాష్) కష్టపడి చదువుతుంటాడు.
స్కూల్ ఏజ్ నుంచే అభి అంటే సిరికి ఇష్టం.వీరి ప్రేమ విషయం జగదీష్ ప్రసాద్‌కు నచ్చదు.
కోపంతో తన అల్లుడిని చంపేందుకు ఓ డీల్ మాట్లాడతాడు.కానీ మళ్లీ తన మనసు మార్చుకుని ఆ డీల్ వద్దని అనుకుంటాడు.
కానీ ఇంతలోపే ఆ డీల్ బెజ్జోని పేట వ్యక్తికి చేరుతుంది? అసలు ఆ డీల్ తీసుకుంది ఎవరు? మధ్యలో జాన్ అనే వ్యక్తి ఎవరు? తన అల్లుడిని కాపాడుకునేందుకు జగ్గూ చేసిన ప్రయత్నాలు ఏంటి? అభి తండ్రి కృష్ణ చివరకు ఏం చేస్తాడు? అనేది కథ.
నటీనటులు:
పగ పగ పగ చిత్రంతో కెరీర్‌లో మొదటి సారిగా తెరపై కనిపించాడు కోటి.సంగీతంతో అందరినీ మెప్పించిన కోటి.ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు.విలన్‌గా అందరినీ ఆకట్టుకున్నాడు.ఇక హీరోగా మొదటి సినిమానే అయినా అభిలాష్ ప్రేక్షకులను మెప్పిస్తాడు.ఇది వరకు ఎన్నో సినిమాలకు యాక్షన్ సీక్వెన్స్‌లో డూప్ చేయడం, పీటర్ హెయిన్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ దగ్గర పని చేసిన అనుభవం అభిలాష్‌కు కలిసి వచ్చింది.యాక్షన్ ఎపిసోడ్స్‌లో అభిలాష్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు.
సీరియస్, కామెడీ ఇలా అన్ని ఎమోషన్స్ పండించాడు.హీరోయిన్‌గా సిరి పాత్రలో దీపిక మెప్పించింది.
కనిపించిన కొన్ని సీన్లలో అందంగా కనిపిస్తుంది.బెనర్జీ, కరాటే కళ్యాణి, జీవా ఇలా అందరూ తమ తమ పాత్రల్లో మెప్పించారు.
విశ్లేషణ:
పగ పగ పగ చిత్రంలో దర్శకుడు ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎంచుకున్నాడు.క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా కొత్తగానే అనిపిస్తుంది.ఎంచుకున్న నేపథ్యం, నాటి పరిస్థితులను బాగానే వాడుకున్నాడు.వాట్సప్ పోన్స్, సోషల్ మీడియా లేని కాలాన్ని ఎంచుకోవడంతో కొత్తగా అనిపిస్తుంది.కానీ కథనం మాత్రం అంత గ్రిప్పింగ్‌గా అనిపించదు.అసలు కథ ప్రారంభించడానికి చాలా టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది.
ప్రథమార్థంలో మాత్రం కాలేజ్ సీన్లు కొన్ని నవ్వు తెప్పిస్తాయి.ఓ పాట కూడా చక్కగా అనిపిస్తుంది.
ఇక అసలు కథ మాత్రం ద్వితీయార్థంలోనే సాగుతుంది.కాంట్రాక్ట్ కిల్లింగ్ ఇవ్వడం, ఆ డీల్ ఎవరికి ఇచ్చారో కనుక్కోవడం, ఆ ప్రాసెస్ అంతా బాగానే అనిపిస్తుంది.కానీ కొన్ని సీన్లు కావాలనే సాగదీసినట్టుగా అనిపిస్తాయి.క్లైమాక్స్ కూడా మన ఊహకు భిన్నంగా సాగుతుంది.
ఎంతో సీరియస్‌గా ముగుస్తుందని ఆశిస్తారు.కానీ కాస్త వినోదాత్మకంగానే క్లైమాక్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది.
పోకిరి సీన్‌ను ఇందులో వాడుకున్న తీరు బాగుంటుంది.
పగ తీర్చుకోవడం అంటే.
చంపడం కాదు.అనుక్షణం భయంతో ఉండేలా చేయడం.
మన వాళ్లను కాపాడుకుంటూ ఉండటం అంటూ ఇలా ముగించేశారు.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఇక సంగీతం ఎంతో వినసొంపుగా ఉంటే.బ్యాక్ గ్రౌండ్ మూడ్‌కు తగ్గట్టుగా ఉంటుంది.కెమెరాపనితనం, ఎడిటింగ్ అన్నీ కూడా చక్కగా కుదిరాయి.