క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం అంటే అంత ఈజీ కాదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ అన్నారు.జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాడ ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు.ఏం చేయాలో.
ఏం చేయకూడదో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సలహా ఇచ్చారని తెలిపారు.ఇప్పుడు మ్యాచ్ సజావుగా జరగడమే ముఖ్యమన్నారు.
టికెట్ల అమ్మకంపై పూర్తి సమాచారం రేపు మీడియాకు తెలియపరుస్తామని వెల్లడించారు.మ్యాచ్ టికెట్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదన్న అజారుద్దీన్ తప్పు చేశామని ఫ్యాన్స్ భావిస్తే పూర్తి వివరాలపై మంత్రికి రిపోర్ట్ అందిస్తామని తెలిపారు.