టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్ఎల్పీపై విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది.ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం విచారణను మధ్యాహ్నాం 2 గంటలకు వాయిదా వేసింది.
అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.క్వాష్ పిటిషన్ ను తిరస్కరిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో పిటిషన్ పై ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి.ఈ పిటిషన్ ను విచారణను ధర్మాసనం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో సుప్రీం ఏం తీర్పు వెలువరిస్తుందోనన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.