మ్యాచ్ గెలిచామని సంతోషించేలోపే హార్దిక్ పాండ్యా కు ఊహించని షాక్..!

ఐపీఎల్ లో మ్యాచ్లు ఉత్కంఠ భరితంగా సాగుతూ చివరి బంతి వరకు ఏ జట్టు గెలుస్తుందో ఊహించ లేనంతగా సాగుతున్నాయి.ఏ మ్యాచ్ గెలుస్తుందో ముందుగానే అంచనా వేయడం అసాధ్యం గా మారింది.

 Gujarat Titans Fined Slow Over Rate In Ipl , Gujarat Titans , Punjab Super Ki-TeluguStop.com

అంతేకాకుండా మ్యాచ్ చివరి దశలో బ్యాటర్లు విరుచుకుపడుతు ఉండడంతో ఆఖరి ఓవర్ల లో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలి అనే విషయంలో ప్రతి జట్టు తర్జన భర్జన పడుతోంది.దీంతో మూడు గంటలలో పూర్తవాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ముగుస్తున్న క్రమంలో, నిర్ణీత సమయంలో ఇన్నింగ్స్ పూర్తి చేయని కెప్టెన్లపై ఐపీఎల్ నిర్వాహకులు భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారు.

తాజాగా గుజరాత్ – పంజాబ్( Gujarat Titans ) మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు సాగి గుజరాత్ జట్టు విజయం సాధించింది.అయితే జట్టు విజయం సాధించిన సంబరం ఎంతోసేపు నిలవలేదు.ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ నమోదు చేయడంతో గుజరాత్ జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యా( Hardik Pandya ) పై రూ.12 లక్షల జరిమానా విధించారు.ఈ ఐపీఎల్ సీజన్లో స్లో ఓవర్ నమోదు చేసిన మూడవ జట్టు గా గుజరాత్ నిలిచింది.తద్వారా రూ.12 లక్షల జరిమానాకు బలైంది.ఇక రెండోసారి కూడా స్లో ఓవర్ నమోదు చేస్తే జరిమానా మొత్తం రూ.24 లక్షలు పెరగనుంది.అంతేకాకుండా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 24% లేదా రూ.6 లక్షల జరిమానా విధించే అవకాశం కూడా ఉంది.

ఇక మూడోసారి స్లో ఓవర్ నమోదు చేస్తే కెప్టెన్ ఒక మ్యాచ్ నుండి నిషేధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.జట్టులో ఉండే ఆటగాళ్ల కు మ్యాచ్ ఫీజులో 50 శాతం లేదంటే రూ.12 లక్షలు జరిమానా విధించబడుతుంది.

ఈ సీజన్లో స్లో ఓవర్ నమోదు చేసినా మూడవ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నిలిచాడు.మొదట బెంగుళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లేసిస్( Faf du Plessis ) ఉండగా, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్( Sanju Samson ) స్లో ఓవర్ నమోదు చేసిన రెండవ కెప్టెన్ గా నిలిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube