ఘనంగా ఆలయ గోపురం పూజ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ( Yellareddipeta )మండలంలో ఉన్న శ్రీ లక్ష్మీ కేశవ పెరమాండ్ల ఆంజనేయస్వామి ఆలయం(Anjaneya Swamy Temple ) పునర్నిర్మాణంలో భాగంగా గుట్టపైన నిర్మిస్తున్నటువంటి ఆలయం పైన గోపురం పూజా కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు, భక్తులు సహకారంతో దినదినాభివృద్ధి చెందుతూ అశ్విని హాస్పిటల్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి ల సహకారంతో గుడి గోపుర నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి.

బుధవారం రోజున ఉదయం 10 గంటల 30 నిమిషములకు ఆలయ అర్చకులు త్రివిక్రమ విష్ణు ఆచార్య, త్రివిక్రమ విజయ్ ఆచార్యలు, శిల్పి అరుణ్ కుమార్ లు గ్రామస్తులచే స్వీకరించినటువంటి నవధాన్యాలు, బంగారు పిసరు, వెండి పిసరు, పగడము, ముత్యము మొదలగు వస్తువులు గోపురం లోపలి భాగంలో వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఆలయ కమిటీ చైర్మన్ పారిపెల్లి రామ్ రెడ్డి, వైస్ చైర్మన్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్,కోశాధికారి గంప నరేష్,మండల రెడ్డి సంఘం అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, ఏఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి,మంకెన చంద్రారెడ్డి, మేగి నరసయ్య , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నర్సయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ , సింగిల్ విండో డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి , పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు , ఏఎంసి డైరెక్టర్లు మెండే శ్రీనివాస్ యాదవ్, చందుపట్ల లక్ష్మారెడ్డి,ఎనుగందుల నరసింహులు, కృష్ణారెడ్డి, బండారి బాల్ రెడ్డి, గడ్డం జితేందర్, గంట వెంకటేష్ గౌడ్, గంట అంజగౌడ్, బానోత్ రాజు నాయక్, గంట బుచ్చాగౌడ్, బుచ్చి లింగ్ సంతోష్ గౌడ్, పందిర్ల శ్రీ నివాస్ గౌడ్, శంకర్ అంతెరువుల గోపాల్ మద్దుల శ్రీపాల్ రెడ్డి గోళిపెల్లి ప్రతాప్ రెడ్డి, గుర్రపు రాములు మిరియాల్కర్ చందు, యమగొండ కృష్ణారెడ్డి, సందుపట్ల రామ్ రెడ్డి,మాద ఉదయ్ కుమార్,గాజుల దాసు, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు వితరణ చేశారు.

Grand Temple Gopuram Poojam Yellareddipeta, Anjaneya Swamy Temple , Rajanna Sir
ప్రభాస్ కు సందీప్ రెడ్డి వంగా విధించిన షరతులు ఇవే.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Latest Rajanna Sircilla News