శృంగేరీ శారదాపీఠన్నీ దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: కర్నాటకలోని శృంగేరీ శారదాపీఠంలోని శ్రీ శారదా మాత అమ్మవారిని ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కుటుంబ సమేతంగా, వ్యాసోజ్జాల రాధాకృష్ణ శర్మ తో కలసి దర్శించుకున్నారు.

అమ్మ వారికి సువర్ణ పుష్ప సేవ నిర్వహించారు.

అమ్మవారి దయతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.అనంతరం శృంగేరీ శారదాపీఠం పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధు శేఖర భారతి స్వాముల వారిని దర్శించి స్వాముల వారికి భిక్షా వందనం, పాదపూజ నిర్వహించి ,ఫలాలు సమర్పించి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది.

Government Whip Adi Srinivas Visited Sringeri Saradapith , Sringeri Saradapith,

ఈ సందర్భంగా వేములవాడ దేవస్థానం అభివృద్ధి కొరకు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధు శేఖర భారతి స్వాముల వారు పలు సలహాలు,సూచనలు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని రానున్న రోజుల్లో వారి పరిపాలన సుభిక్షంగా జరగాలని, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవాలని దీవించారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శృంగేరీ శారదాపీఠం పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధు శేఖర భారతి స్వాముల వారిని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవాల్సిందిగా కోరగా దీనికి స్వామి వారు సానుకూలంగా స్పందించారు.

Advertisement
ప్రభాస్ కు సందీప్ రెడ్డి వంగా విధించిన షరతులు ఇవే.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Latest Rajanna Sircilla News