సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు 70 లక్షల ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసిన కేంద్రం...!

ఇటీవలే కాలంలో సైబర్ నేరాల బారిన పడి లక్షల్లో, కోట్లలో డబ్బులు కోల్పోతున్న అమాయక బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది.ప్రభుత్వాలు, అధికారులు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్న.

 Government Blocks 70 Lakh Suspicious Mobile Numbers Details, Central Government,-TeluguStop.com

సైబర్ నేరాల పట్ల ప్రజలకు ఎంతగా అవగాహన కల్పించిన సైబర్ నేరాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.దీంతో సైబర్ నేరాలకు( Cyber Crimes ) చెక్ పెట్టేందుకు ఆన్లైన్ స్కాంలో( Online Scam ) భాగస్వామ్యమైన 70 లక్షల ఫోన్ నెంబర్లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది.

ఇటీవలే ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి NPCI, TRAI, RBI, IT మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఖాతాల్లో తక్కువ నగదు నిల్వలతో కొనసాగడం, అకస్మాత్తుగా ఖాతాలలో నగదు బదిలీలు పెరగడం పై చర్చించారు.

సైబర్ నేరాలను కట్టడి చేయడంలో భాగంగానే ఫోన్ నెంబర్లను( Phone Numbers ) బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.జనవరి నెలలో మరోసారి సమావేశం నిర్వహించి.

సైబర్ నేరాల గురించి చర్చించి, అవసరమైతే మరికొన్ని లక్షల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసే అవకాశం ఉంది.

Telugu Numbers Block, Numbers, Central, Cyber Crimes, Scams, Vivek Joshi-Latest

ప్రజలు తమ ఫోన్ నెంబర్లను, బ్యాంక్ ఖాతాలను ఎలా సంరక్షించుకోవాలి కూడా ఈ సమావేశం ద్వారా కొన్ని సూచనలు చేయడం జరిగింది అవి ఏమిటో చూద్దాం.సైబర్ నేరగాళ్లు సిమ్ స్వాపింగ్ లో( Sim Swapping ) భాగంగా మీ మొబైల్ నెంబర్ ను కొత్త సిమ్ కార్డుకు మార్చమని సలహా ఇస్తారు.అలా చేస్తే మీ ఫోన్ నెంబర్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్తుంది.

ఆ తర్వాత ఫోన్ నెంబర్ తో అనుసంధానం చేయబడిన బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.కాబట్టి పిన్ లేదా పాస్వర్డ్ ను ఏర్పాటు చేసుకోవాలి.

Telugu Numbers Block, Numbers, Central, Cyber Crimes, Scams, Vivek Joshi-Latest

సరైన ధ్రువీకరణ లేకుండా ఫోన్లకు వచ్చే లింక్స్ పై క్లిక్ చేయకూడదు.సైబర్ నేరగాళ్లు బ్యాంక్, ఇతర ప్రముఖ సంస్థల పేర్లతో కొన్ని లింక్స్ పంపుతుంటారు.పొరపాటున అలాంటి లింక్స్ పై క్లిక్ చేస్తే వ్యక్తిగత వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతికి చేరతాయి.వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులకు చెప్పకూడదు.ముఖ్యంగా పిన్ లేదా పాస్వర్డ్ లను ఇతరులకు షేర్ చేయకూడదు.బ్యాంకు నుంచి అధికారులు వివరాల కోసం ఫోన్ చేయరు.

ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే నేరుగా బ్యాంకుకు వెళ్లే వివరాలు ఇవ్వాలి.ఫోన్ ద్వారా వ్యక్తిగత వివరాలు తెలుపకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube