ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

నల్లగొండ జిల్లా:దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రప్రధమ ఆశాజ్యోతి అయిన మహనీయుడు జ్యోతిభాపూలే అని ప్రజా పోరాట సమితి (పీ.ఆర్.

పీ.ఎస్)రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.

Glorious Mahatma Jyotirao Poole Jayanti Celebrations-ఘనంగా మహా�

సోమవారం జ్యోతిభాపూలే 195 వ జయంతి సందర్భంగా చిట్యాలలో ఆయన విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా జోహార్లర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో మహామహోపాధ్యాయుడు కారల్ మర్క్స్ వర్గ దోపిడీ సిద్ధాంతాన్ని ప్రవచించిన అదేసమయంలో మన దేశంలో సామాజిక దోపిడీ సిద్ధాంతాన్ని ప్రవచించిన మహామహోపాధ్యాయుడు జ్యోతిభాపూలే అని" కొనియాడారు.

దేశంలో సామాజిక చైతన్యానికి ప్రప్రధముడు జ్యోతిభాపూలే అని,ప్రపంచవ్యాప్తంగా వర్గ సిద్ధాంతం ఎంత ముఖ్యమో,దేశ పరిస్థితుల్లో జ్యోతిభా పూలే ప్రవచించిన సామాజిక సిద్ధాంతం అంతే ముఖ్యమైందని తెలిపారు.దేశంలో సామాజిక ఉద్యమాలు మహోజ్వలంగా సాగకుండా అణగారిన వర్గాలకు న్యాయం జరగదని,జ్యోతిభా పూలే లేకపోతే సామాజిక ఉద్యమాల ప్రతీకలైన బరోడా రాజు సాహు,డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్,బాబూ జగ్జీవన్ రామ్ లేరని,జ్యోతి భాపూలే చెప్పిన గులామ్ గిరి నేటికీ కొనసాగుతోందని దానిని తుదముట్టించడమే మన కర్తవ్యమని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీ.ఆర్.పీ.ఎస్ జిల్లా నాయకులు నాగిళ్ళ యాదయ్య,ముప్పిడి మారయ్య,ఎన్నమళ్ళ పృథ్వీరాజ్,గుంటోజు శంకరయ్యచారి,బర్రె సంజీవ,పోతెపాక విజయ్,వల్కి నాగయ్య, మునుకుంట్ల శ్రీనివాస్ గౌడ్,కోనేటి శ్రీరామ్,నాగిళ్ళ ప్రకాశ్,పబ్బు చంద్రశేఖర్ గౌడ్,ముప్పిడి రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన అమృత

Latest Nalgonda News