చాలామంది ఉన్నత విద్య, ఉద్యోగం, జీవనోపాధి వంటి వివిధ కారణాల వల్ల పట్టణాలకు వెళ్తుంటారు.అక్కడ వారికి వంట చేసుకోవడానికి సరైన సౌకర్యాలు ఉండవు.
ఇక చేసేదేమి లేక ప్రైవేట్ హాస్టల్స్ లో ఉండాల్సిన పరిస్థితులు వస్తుంటాయి.అక్కడ ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా గత్యంతరం లేక అలానే నివసిస్తుంటారు.
ముఖ్యంగా ఆహారం విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.నిజానికి హాస్టల్లో ఉండే ఆహారం ఇంట్లో ఉన్నట్లు ఉండదు.
దీంతో ఓ పూట తిని మరో పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.ఇక మరికొందరేమో వంట వచ్చినా కూడా చేసుకునేందుకు వెసులుబాటు లేకపోవడంతో ఆకలి బాధలతో గడుపుతుంటారు.
అయితే కొందరు అమ్మాయిలు మాత్రం వెరైటీగా ఆలోచించి ఎలక్ట్రిక్ కెటిల్లో రుచికరమైన చికెన్ కర్రీ( Chicken curry ) కుక్ చేశారు.దానినే కడుపునిండా ఆరగించారు.సాధారణంగా ఎలక్ట్రిక్ కెటిల్లో ఇన్స్టంట్ నూడుల్స్, వోట్మీల్, ఎగ్స్ వంటి త్వరగా కుక్ అయ్యే రెసిపీలు వండుతారు.మీట్ కుక్ చేసే ఐడియా ఎవరికీ రాదు.కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని అమ్మాయిలు మాత్రం ఔట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేశారు.ఆ వీడియోలో వారు హాస్టల్ రూమ్ లో కుక్ చేయడం చూడవచ్చు.
వారు ఓ ప్లేట్ లో ఉల్లిగడ్డలు, పచ్చిమర్చి, టమాటాలు, బంగాళాదుంపలను ముక్కలుగా కోసుకున్నారు.చికెన్ ను కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నారు.
ఆ తర్వాత ఓ ఎలక్ట్రిక్ కెటిల్( Electric kettle ) లో నూనె వేసి, అది వేడయ్యాక చికెన్ వేశారు.అందులో కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలు వేశారు.అందులోనే కాస్త ఉప్పు, రుచికి సరిపడా కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర వేశారు.కొన్ని నీళ్లు పోసుకుని బాగా కలిగి కొంత సమయం ఉడికించారు.
అంతే వేడివేడిగా నోరూరించే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.ఈ వీడియోను @tanushree_khwrkpm అనే అకౌంట్ ద్వారా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
ఇప్పటి వరకు ఈ వీడియోకి మూడు లక్షలకు పైగా లైక్స్, కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.వీడియో చూసిన కొంతమంది ‘నేను కూడా ఈ రెసిపీని ప్రయత్నిస్తాను.’అంటూ కామెంట్స్ పెడుతుంటే మరి కొందరేమో ‘హాస్టల్( Hostel)లో ఏదైనా సాధ్యమే’ అని కామెంట్స్ చేస్తున్నారు.మీరు కూడా ఆ వంట వీడియో వైపు ఒకసారి లుక్కేయండి.